// // Hyderabad: విద్యార్థులకు శుభవార్త.. జూలై 10 నుంచి మూడు రోజులు సెల‌వులు, కాకపోతే -->
E-Paper
Advertisement

Hyderabad: తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త.. జూలై 10 నుంచి మూడు రోజులు సెల‌వులు, కాకపోతే

Hyderabad: తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త.. జూలై 10 నుంచి మూడు రోజులు సెల‌వులు, కాకపోతే
Advertisement

Hyderabad: తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త. జూలై 10 అనగా శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరసగా మూడురోజులపాటు సెలవులు రానున్నాయి. ఈ విషయం తెలియగానే పాఠశాలలు, కాలేజీ విద్యార్థులు ఫుల్‌ఖుషీ అవుతున్నారు. ఇంతకీ శుక్రవారం సెలవు మాటేంటి? ఇంతకీ ఉన్నాట్టా? లేనట్టా? ఇవే ప్రశ్న చాలామందిని వెంటాడుతున్నాయి.

తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త-తెలంగాణలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. జూలై 10న కమ్యూనిస్టుల విద్యార్థి సంఘాలు తెలంగాణ అంతటా విద్యాసంస్థల బంద్‌కు పిలుపు ఇచ్చాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల కంటే బంద్ ప్రభావం ఎక్కువగా హైదరాబాద్‌లో కనిపించే అవకాశాలున్నాయి.

Advertisement

వరుసగా మూడు రోజుల సెలవులు- జూలై 11న రెండో శనివారం, ఆదివారం ఎప్పుడూ వచ్చే సెలవు కావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఇంతకీ జూలై 10న తెలంగాణ వ్యాప్తంగా లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఎందుకు బంద్‌కు పిలుపు ఇచ్చాయి? విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

వామపక్షాల విద్యార్థి సంఘాలు శుక్రవారం బంద్‌కు పిలుపు– ఈ నేపథ్యంలో వామపక్ష విద్యార్థి సంఘాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ-ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు బంద్‌ చేయాలని పిలుపు ఇచ్చాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా ఏర్పాట్లు చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. అయితే జూలై 10న అన్ని పాఠశాలలు మూతపడతాయని ప్రభుత్వం ప్రకటన చేయలేదు.

Advertisement

కాకపోతే ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు తమ తమ విద్యార్థులకు ఈ విషయాన్ని వివరించినట్టు తెలుస్తోంది. బంద్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో విద్యాసంస్థలపై ప్రభావం చూపే అవకాశముంది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంద్ ప్రభావం ఉండవచ్చని భావిస్తున్నారు.

ALSO READ: ఆయిల్ ఫామ్ పంటలపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్.. ఎమన్నారంటే..?

పరిస్థితులను బట్టి కొన్ని జిల్లాల్లో పాఠశాలలు కంటిన్యూ కొనసాగవచ్చు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్నది విద్యార్థి సంఘాల ప్రధాన పాయింట్. విద్యార్థుల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో AISF, SFI, PDSU, AIDSO, AIFDS, AISB, AIPSU వామపక్ష విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

బంద్ కార్యాచరణను ఖరారు చేసి విజయవంతం చేయాలని నిర్ణయించారు. జూలై 10న బంద్ నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడే అవకాశం ఉంది. జూలై 11న రెండో శనివారం సెలవు ఉంటుంది. జూలై 12న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు స్కూళ్లు మూతబడే అవకాశం ఉంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×