E-Paper
Advertisement

శాపం ఉన్న ఊరికే బదిలీ… ఐఏఎస్ ఆఫీసర్ ను వణికించే హర్రర్ సీన్స్

శాపం ఉన్న ఊరికే బదిలీ… ఐఏఎస్ ఆఫీసర్ ను వణికించే హర్రర్ సీన్స్
Advertisement

Horror Thriller OTT:  నాస్తికులు దేవుళ్ళను దెయ్యాలను నమ్మరన్న విషయం తెలిసిందే. అయితే చాలామంది చదువుకున్న వాళ్ళు సైతం ఇలాగే ఆలోచిస్తారు. మరి అలాంటి వాళ్ళకు దెయ్యాలు కన్పిస్తే ? ఏకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను వణికించే భయంకరమైన సంఘటనలు చోటు చేసుకుంటే… ఊరిని డెవలప్ చేయడానికి మైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు రాక్షసుడి తల బయట పడి, శాపం వెంటాడితే… ఎలా ఉంటుందో తెలుసుకోవాలా ? అయితే ‘దహన్: రాకన్ కా రహస్య’ (Dahan Raakan Ka Rahasya) సిరీస్ మీ కోసమే. 2022లో విడుదలై ఓటీటీలో భారీ సంచలనం సృష్టించిన మలయాళ సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఇది. మరి ఇంతకీ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

రాజస్థాన్‌లోని శిలాస్‌పురా అనే మారుమూల గ్రామంలో కథ సాగుతుంది. ఈ గ్రామంలో మూఢ నమ్మకాలు, ఆచారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే మరోవైపు ఐఏఎస్ అధికారిణి అయిన అవని రౌత్ పై అవినీతి ఆరోపణలు వస్తాయి. వాటిని పోగొట్టుకోవడానికి ఈ గ్రామానికి బదిలీపై వస్తుంది. ఆమె గ్రామ అభివృద్ధి కోసం గని తవ్వకాలను ప్రారంభించాలని నిర్ణయిస్తుంది. కానీ గ్రామ పెద్ద స్వరూప్, స్థానికులు ఈ పనికి తీవ్రంగా వ్యతిరేకతను తెలియజేస్తారు.

Advertisement

ఆ గని కింద ‘రాకన్’ అనే పురాతన రాక్షసుడి తలను దాచారని, ఒకవేళ గనిని తవ్వితే ఆ రాక్షసుడు మేల్కొని సర్వనాశనం చేస్తాడని వాళ్ళంతా నమ్ముతారు. అవని ఈ మూఢనమ్మకాలను కొట్టిపారేసి మైనింగ్ పనులను మొదలు పెడుతుంది. గని తవ్వకాలు ప్రారంభమైన తర్వాత గ్రామంలో వింత వింత సంఘటనలు, ఘోరమైన హత్యలు, విచిత్రమైన వైరస్ వ్యాపించడం మొదలవుతాయి. అవని మొదట్లో ఇవన్నీ సైంటిఫిక్ కారణాల వల్ల జరుగుతున్నాయని భావిస్తుంది.

కానీ క్రమంగా ఆమెకు ఆ గ్రామంలో దాగి ఉన్న ప్రాచీన రహస్యాలు బయట పడతాయి. రేఖ వంటి సాధువైన అమ్మాయి తన గ్రామాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె తల్లి రాజేశ్వరి ఆత్మ కూడా ఆమెకు సహాయం చేస్తుంది. రేఖకు ఉన్న శక్తులు ఏంటి ? చివరికి వాటిని ఎలా వాడుకుంది ? తాంత్రిక శక్తులను ఉపయోగించి విగతిని ఎలా అంతం చేసింది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? ఆ గ్రామాన్ని కాపాడడానికి ఏం చేశారు ? వైరస్ ను ఎలా అంతం చేశారు ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?   

Advertisement

‘దహన్ రాకన్ కా రహస్య’ అనే ఈ హారర్ సిరీస్ అద్భుతంగా ఉంటుంది. టిస్కా చోప్రా, సౌరభ్ శుక్ల ప్రధాన పాత్రలు పోషించారు. Jio Hotstarలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. హారర్ థ్రిల్లర్ మూవీ లవర్స్ డోంట్ మిస్. ముఖ్యంగా దేవుళ్ళు, దెయ్యాలని నమ్మని వాళ్ళు చూడాల్సిన సిరీస్ ఇది.

Read Also: ఈ పొగను పీలిస్తే పోతారు మొత్తం పోతారు… దిమ్మతిరిగే కొరియన్ మిస్టరీ హర్రర్ సిరీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×