E-Paper
Advertisement

Telangana Govt: తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు.. బ్రేక్‌ ఫాస్ట్‌లో ఆరు రకాల మెనూ, ఏంటో తెలుసా?

Telangana Govt: తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు..  బ్రేక్‌ ఫాస్ట్‌లో ఆరు రకాల మెనూ, ఏంటో తెలుసా?
Advertisement

Telangana Govt: పాఠశాల, కాలేజీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. 2026-27 విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కి ఆరు రకాల టిఫిన్లు అందించాలని డిసైడ్ అయ్యింది. ఈ పథకాన్ని ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థుల వరకు ఇదొక శుభవార్త.

తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు

Advertisement

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గతంలో ప్రకటించినట్టుగా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలుకు సంబంధించి కసరత్తు పూర్తి చేసింది. అందుకు సంబంధించిన మెనూ రెడీ చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది విద్యార్థులకు వారంలో ప్రతిరోజూ ఉదయం రోజుకో టిఫిన్ అందజేయనుంది.

వారానికి ఏడు రోజులు కావడంతో ఆరు రోజులు రోజు రకం టిఫిన్ విద్యార్థులకు అందించనుంది. ఉదయం టిఫిన్, పాలు/రాగి జావ ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం ఉదయం దోశ, పాలు ఇవ్వనుంది. మంగళవారం రోజు మిల్లెట్ ఇడ్లీతోపాటు రాగి జావ ఇవ్వాలని నిర్ణయించింది. ఇక బుధవారం ఉదయం పూరీ, పాలు ఇవ్వనుంది. గురువారం ఉదయం మిల్లెట్ ఇడ్లీతోపాటు రాగి జావ విద్యార్థులకు ఇవ్వనుంది.

Advertisement

బ్రేక్‌ ఫాస్ట్‌లో ఆరు రకాల మెనూ రెడీ

శుక్రవారం ఉదయం మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్ తోపాటు పాలు ఇవ్వనుంది. ఇక శనివారం ఉదయం బోండాతోపాటు రాగి జావ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకు ఈ మెనూ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం దోసెకు బదులు చపాతీ, శుక్రవారం మిల్లెట్‌ ఉప్మాకు బదులు పొంగల్‌ ఇవ్వాలని ఆలోచన చేసింది. అయితే వీటిలో వీలును బట్టి అందించేలని భావిస్తున్నారు.

ఇందుకోసం దాదాపు రూ.720 ఖర్చు అవుతందని ప్రభుత్వం అంచనా వేసింది. పాఠశాల విద్యార్థుల టిఫిన్‌ కోసం రూ.540 కోట్లు, పాల కోసం రూ.180 కోట్లు అవుతుందని తేల్చింది. ఈ నిధులను బడ్జెట్‌లో కేటాయించింది ప్రభుత్వం. పాఠశాల విద్యార్థులతోపాటు ఇంటర్ విద్యార్థులకు సంబంధించి దాదాపు రూ.56 కోట్లు కేటాయించింది. పాఠశాల/ కాలేజీలో విద్యార్థులు టిఫిన్ చేయడానికి 45 నిమిషాలు కేటాయించనున్నారు.

ALSO READ: వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం.. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి

ప్రభుత్వ పాఠశాలల్లో డ్రా పౌట్లను తగ్గించడం ప్రధాన ఉద్దేశం. అంతేకాదు పేద విద్యార్థులలో పోషకాహార లోపాన్ని నివారించడం ఈ పథకం లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. చిరు ధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడం వల్ల విద్యార్థుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. పాఠశాల కమిటీలు ప్రతిరోజూ ఆహారాన్ని తనిఖీ చేస్తుంది. పాఠశాల ప్రారంభానికి ముందే విద్యార్థులకు అల్పాహారం వడ్డించేలా చర్యలు చేపట్టనుంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×