E-Paper
Advertisement

Gomaram Bal Reddy: మేడ్చల్ కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. జిల్లా ఉపాధ్యక్షుడిగా బాల్‌రెడ్డి!

Gomaram Bal Reddy: మేడ్చల్ కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. జిల్లా ఉపాధ్యక్షుడిగా బాల్‌రెడ్డి!
Advertisement

Gomaram Bal Reddy: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా గోమారం బాల్‌రెడ్డిని నియమిస్తూ డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తొటకూర వజ్రేష్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నియామక పత్రంలో పేర్కొన్నారు.

పార్టీ అభివృద్ధికి కృషి..

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, డీసీసీ అధ్యక్షుడు తొటకూర వజ్రేష్ యాదవ్‌కు గోమారం బాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Also read: Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కొత్త మలుపు.. మానవ హక్కుల కమిటీ వద్దంటూ కోర్టుకు వెళ్లిన తల్లి!

ఈ కార్యక్రమంలో..

పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 298 కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు శంకర్, సంతోష్ గౌడ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also read: Sircilla Councillor: సిరిసిల్ల మున్సిపాలిటీ పరువు తీసిన వీడియో.. సోషల్ మీడియాలో హల్ చల్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×