E-Paper
Advertisement

రిలేషన్లో బావా మరదళ్లు… ప్రెగ్నన్సీతో ఊహించని ట్విస్ట్

రిలేషన్లో బావా మరదళ్లు… ప్రెగ్నన్సీతో ఊహించని ట్విస్ట్
Advertisement

Telugu web series: లైఫ్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఎవ్వరికీ తెలియదు. మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, బౌండరీస్ అన్నీ ఒక్కసారిగా మారిపోతూ ఉంటాయి. అలాంటి టైమ్ లో బతుకు భారంగా అన్పిస్తుంది. ఆ టైమ్ లో చేసే పనులే మన లైఫ్ జర్నీని నిర్ణయిస్తాయి. అలాంటి ఒక హార్ట్ టచింగ్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఇదొక ఇండిపెండెంట్ తెలుగు వెబ్ సిరీస్. ‘షిఫ్టింగ్ హారిజన్స్’ (Shifting Horizons) అనే టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ ను ఫ్రీగా ఎక్కడ చూడవచ్చు ? ఎన్ని ఎపిసోడ్లు ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఎపిసోడ్ 1 : Decision

Advertisement

మొదటి ఎపిసోడ్ లో కథ మన అందమైన హీరోయిన్ తో స్టార్ట్ అవుతుంది. ఆమెకు తన బావ అంటే చాలా ఇష్టం. బావ-మరదళ్ల మధ్య ఉండే ఆ అపారమైన ప్రేమ, అవగాహన, గౌరవం చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఇక ఈ జంట తమ లోకంలో సంతోషంగా ఉంటారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవదు. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో, వీళ్ళ జీవితంలో ఒక అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ పరిస్థితుల్లో, లాక్‌డౌన్ భయాల మధ్య భవిష్యత్తు గురించిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.

ఎపిసోడ్ 2 : Conflict

Advertisement

ఇక్కడి నుండి స్టోరీ మరింత ఎమోషనల్‌ గా మారుతుంది. కోవిడ్ వల్ల పరిస్థితులు దారుణంగా మారతాయి. ఆక్సిజన్ కొరత, హాస్పిటల్ లో బెడ్స్ లేకపోవడం, ఒంటరిగా పోరాడుతున్న వ్యక్తుల కథలు… ఈ సీన్లే హీరోయిన్ జీవితంలో రిపీట్ అవుతాయి. అదే సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యుడు, 23 ఏళ్ల వయసున్న ఒక యువకుడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతాడు. ఆ ఆకస్మిక మరణం స్రవంతిని తీవ్రమైన గుండెకోతకు గురి చేస్తుంది. భర్త, కుటుంబం, సమాజం… అందరూ ఆమెను ఆ దుఃఖం నుంచి బయట పడేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అది సాధ్యం కాదు.

ఎపిసోడ్ 3 : Resilience

ఇదే సిరీస్ లో చివరి ఎపిసోడ్. అంతటి శోకాన్ని, బాధను స్రవంతి ఎలా అధిగమించింది అనేది ఈ ఎపిసోడ్ స్టోరీ. కోవిడ్ కష్టాలను ఈ సిరీస్ కళ్ళకు కడుతుంది.

ఫ్రీగానే చూడవచ్చు

2026 జూలైలో విడుదలైన ఈ సిరీస్లో, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఒక యువతి ఎదుర్కొన్న సమస్యలను అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు. అవినాష్ ధరిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ 3 ఎపిసోడ్ సిరీస్‌లో స్రవంతి ప్రత్తిపాటి, రిషి కౌశిక్ ప్రధాన పాత్రలు పోషించారు. దీన్ని ఓటీటీలో ఉచితంగా చూడవచ్చు. PoV-creations యూట్యూబ్ ఛానల్‌లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.

Read Also: 40 రోజులు నలుగురు పిల్లలు మిస్సింగ్… అమెజాన్ అడవుల్లో అదిరిపోయే అడ్వెంచర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×