E-Paper
Advertisement

Kidnap : ఘట్ కేసర్ కిడ్నాప్ కేసు.. చిన్నారి సేఫ్..

Kidnap : ఘట్ కేసర్ కిడ్నాప్  కేసు.. చిన్నారి సేఫ్..
Advertisement

Kidnap : మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ లో జరిగిన బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఈడబ్ల్యూసీ కాలనీలో చిన్నారి కృష్ణవేణి బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటోంది. ఆ సమయంలో చిన్నారి కిడ్నాప్ నకు గురైంది. సీసీ ఫుటేజీ ఆధారంగా అదే కాలనీకి చెందిన సురేశ్‌ బాలికను అపహరించాడని పోలీసులు గుర్తించారు.

బాలిక ఆచూకీ కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిందితుడు సురేశ్‌ అనుమానాస్పందంగా తిరుగుతుండగా రైల్వే పోలీసులు విచారించారు. ఆ చిన్నారిని ఘట్‌కేసర్‌లో కిడ్నాప్‌ చేశానని నిందితుడు అంగీకరించాడు. దీంతో రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి కృష్ణవేణి ఆచూకీ లభించిన నేపథ్యంలో ఘట్‌కేసర్‌ పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

ఘట్ కేసర్ పోలీసులు పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డ సురక్షితం రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు వేగంగా స్పందిండంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×