E-Paper
Advertisement

చెత్త వేయొద్దంటూ జనాల కాళ్లు మొక్కిన జీహెచ్ఎంసీ సూపర్‌వైజర్, ఇకనైనా మారండ్రా!

చెత్త వేయొద్దంటూ జనాల కాళ్లు మొక్కిన జీహెచ్ఎంసీ సూపర్‌వైజర్, ఇకనైనా మారండ్రా!
Advertisement

Stop Littering: హైదరాబాద్‌: నగరాల్లో చెత్త సమస్య అనేది అధికారులకు పెను సవాలుగా మారింది. ఎన్ని జరిమానాలు విధించినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా కొందరిలో మార్పు రావడం లేదు. అయితే, హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ డివిజన్, రామసింగపుర ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ సూపర్‌వైజర్ మహేందర్ చేపట్టిన ఒక వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఇష్టారాజ్యంగా చెత్త వేస్తున్న వారిని శిక్షించడం కంటే, వారిలో పశ్చాత్తాపం కలిగించడం మిన్న అని ఆయన భావించారు.

సాధారణంగా చెత్త వేసేవారితో అధికారులు వాదనకు దిగడం లేదా ఫైన్ వేయడం చూస్తుంటాం. కానీ మహేందర్ రూటే వేరు. తెల్లవారుజామునే ఆ ప్రాంతానికి చేరుకుని, రోడ్డుపై చెత్త పారబోయడానికి వచ్చే వారికి ఎదురుగా వెళ్లి వినయంగా నమస్కరిస్తున్నారు. అంతటితో ఆగక, “మీ కాళ్లు మొక్కుతా.. దయచేసి ఇక్కడ చెత్త వేయకండి” అంటూ వారి పాదాలకు నమస్కరిస్తూ వేడుకుంటున్నారు. అధికారుల నుంచి ఇలాంటి స్పందనను ఊహించని స్థానికులు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.

Advertisement

అయితే ఈ గాంధీగిరి వెనుక ఒక బలమైన ఉద్దేశం ఉంది. రామసింగపుర ప్రాంతంలో రహదారి పక్కన చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పరిసరాలు దుర్వాసన కొడుతూ, వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రతిరోజూ ఉదయం ఇంటింటికీ వచ్చి చెత్తను సేకరిస్తున్నప్పటికీ, కొంతమంది బద్ధకంతో లేదా అలవాటుగా రోడ్డుపైనే పారబోస్తున్నారు. ఈ ధోరణిని మార్చడానికి భయం కంటే భక్తి, మర్యాద అనే ఆయుధాలను మహేందర్ ఎంచుకున్నారు.

నిజానికి, ఒక ప్రభుత్వ అధికారి సామాన్యుల కాళ్లు మొక్కడం అనేది చిన్న విషయం కాదు. తన విధి పట్ల ఉన్న అంకితభావం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే తపన మహేందర్‌ను ఈ స్థాయికి ప్రేరేపించాయి. ఆయన విజ్ఞప్తిని చూసి చాలామంది స్థానికులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. “మనం చేస్తున్న పనికి ఒక అధికారి కాళ్లు మొక్కడమేంటి?” అన్న ఆలోచన వారిలో మార్పుకు నాంది పలుకుతోంది. కొందరు అక్కడికక్కడే తాము ఇకపై రోడ్డుపై చెత్త వేయబోమని ప్రమాణం కూడా చేస్తున్నారు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో గ్యాస్ కొరత.. సమస్యను తక్షణమే పరిష్కరించాలి, కేంద్రమంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ

స్వచ్ఛ భారత్ లక్ష్యాలను చేరుకోవాలంటే కేవలం ప్రభుత్వాలు చట్టాలు చేస్తే సరిపోదు, ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని ఈ ఘటన నిరూపిస్తోంది. మహేందర్ చేసిన ఈ వినూత్న ప్రయత్నంపై ఉన్నతాధికారులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి “వినయపూర్వక నిరసనలు” సమాజంలో ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయని, తద్వారా మన హైదరాబాద్‌ను మరింత అందంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×