E-Paper
Advertisement

రీల్స్ పిచ్చి ..5వ అంతస్తు నుంచి కింద పడి 13 ఏళ్ల బాలిక మృతి

రీల్స్ పిచ్చి ..5వ అంతస్తు నుంచి కింద పడి 13 ఏళ్ల బాలిక మృతి
Advertisement

Tirupati: తిరుపతిలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. సరదాగా చేస్తున్న రీల్స్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారెడ్డినగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో 13 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

నేపాల్ దేశానికి చెందిన ధను బహదూర్ కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం తిరుపతికి వలస వచ్చింది. రాజారెడ్డినగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ధను బహదూర్ వాచ్‌మెన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని కుమార్తె పుష్ప (13) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు వీడియోలు, రీల్స్ చేసేది.

Advertisement

ఎప్పటిలాగే రీల్స్ చేయడానికి వీడియో సెట్టింగ్ చేసుకుంటున్న క్రమంలో.. అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు అంచున అదుపు తప్పి కింద పడిపోయింది. తీవ్ర గాయాలైన బాలికను ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. తన కళ్ల ముందే కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Also Read: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ వేట.. రూ. 25 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి సీజ్!

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×