E-Paper
Advertisement

Gadwal: గద్వాల్‌లో మళ్లీ మొదలైన బుల్డోజర్ల హడావుడి..!

Gadwal: గద్వాల్‌లో మళ్లీ మొదలైన బుల్డోజర్ల హడావుడి..!
Advertisement

Gadwal: స్వేచ్చ బ్యూరో: గద్వాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు కృష్ణవేణి చౌరస్తా, కొత్త బస్టాండ్ రోడ్డు తదితర ప్రధాన ప్రాంతాలలో రోడ్లు, పుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణల తొలగింపు ప్రక్రియను గురువారం పునఃప్రారంభించారు. ఇందులో భాగంగా మున్సిపల్ అధికారులు ఎక్కడి వరకు మార్కింగ్ వేశారో అక్కడ వరకు రోడ్లకు ఇరువైపులా ఆక్రమించి అక్రమంగా నిర్వహిస్తున్న దుకాణాలను, షెడ్లను తొలగిస్తున్నారు. ఆపరేషన్‌ రోప్‌లో భాగంగా ఫుట్‌పాత్‌లపై, రహదారులకు ఇరువైపుల వెలసిన దుకాణాలు, తోపుడు బండ్లను అధికారులు తొలగిస్తున్నారు. కృష్ణవేణి చౌరస్తా నుంచి గర్ల్స్ హై స్కూల్ వరకు రోడ్డుకు ఇరువైపుల ఆక్రమణల తొలగింపు కొనసాగుతుందని, గద్వాల పట్టణంలో విడుతల వారిగా ఈ ప్రక్రియ ‌కొనసాగుతుందని గద్వాల మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

అరకొర చర్యలు వద్దు

గద్వాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు కృష్ణవేణి చౌరస్తా, కొత్త బస్టాండ్ రోడ్డు తదితర ప్రధాన ప్రాంతాలలో రోడ్లు, పుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణల తొలగింపు ప్రక్రియను పునఃప్రారంభించడం ఆహ్వానించదగ్గ పరిణామమని చుక్క సుదర్శన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Also Read: Gurukul Vacancies: గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి బ్రేక్.. బ్యాక్ డోర్‌లో అమ్మేస్తున్నారా?

తీవ్ర అసంతృప్తి వ్యక్తం..

గతంలో భీంనగర్, అంబేద్కర్ చౌరస్తా వంటి రద్దీ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు ఆక్రమణల గుర్తించి మార్కింగ్ వేసి, పనులు ప్రారంభించినప్పటికీ అర్ధాంతరంగా నిలిపివేయడం పట్ల పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని గుర్తుచేశారు. కేవలం అధికారులు హెచ్చరికలు, మార్కింగ్‌లతో సరిపెట్టి వెనక్కి తగ్గడం వల్ల ఆక్రమణదారులు మళ్లీ యథారాజా తథాప్రజగా రోడ్లను ఆక్రమించుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు ప్రారంభించిన ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, చివరి వరకు పారదర్శకంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: Tirumala Theft: తిరుమల విగ్రహం చోరి కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడు టీడీపీ నేతగా గుర్తింపు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×