E-Paper
Advertisement

మార్కెట్లోకి ఖరీదైన స్పోర్ట్స్ బైక్.. ఒక్కసారి రోడ్డుపైకి వెళ్తే.. రేసింగ్ ప్రియులకు పూనకాలే!

మార్కెట్లోకి ఖరీదైన స్పోర్ట్స్ బైక్.. ఒక్కసారి రోడ్డుపైకి వెళ్తే.. రేసింగ్ ప్రియులకు పూనకాలే!
Advertisement

Ducati Panigale V2 S: డుకాటీకి చెందిన ప్రముఖ సూపర్ బైక్ ‘పానిగేల్ వి2 ఎస్’ (Ducati Panigale V2 S) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికన్ కంపెనీకి చెందిన ఈ బైక్‌కు సంబంధించి ఓ సరికొత్త అప్‌డేట్ భారత మార్కెట్లోకి వచ్చింది. ఎంతో ఆకర్షణీయమైన ‘వివిడ్ ఎల్లో’ (Vivid Yellow) రంగులో ఈ బైక్ భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ స్పోర్ట్స్ బైక్ డెలివరీలు.. దేశంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి.

ధర ఏకంగా రూ.21.86 లక్షలు

డుకాటీ పానిగేల్ వి2 ఎస్ పసుపు రంగు వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 21.86 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ బ్రాండ్ నుంచి వస్తున్న బైక్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే బుకింగ్స్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు మొదలుపెట్టారు. సాధారణంగా డుకాటీ అనగానే ‘రెడ్’ కలర్ గుర్తుకొస్తుంది. కానీ ఈ సరికొత్త పసుపు రంగు (వివిడ్ ఎల్లో) రోడ్డుపై వెళ్తుంటే.. ఎవరినైనా ఆకట్టుకునేలా ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇవ్వనుంది.

అత్యాధునిక ఫీచర్లు

Advertisement

ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీని బాడీ ఎక్కువ భాగం ప్రకాశవంతమైన పసుపు రంగులో మెరిసిపోతోంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ముందు భాగంలో అగ్రెసివ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, ఏరోడైనమిక్ బాడీ వర్క్, మస్కులర్ ఇంధన ట్యాంక్, వెనుక వైపు ఉన్న స్లీక్ షార్ప్ టైల్ సెక్షన్ ఈ బైక్‌కు అసలైన రేసింగ్ బైక్ లుక్‌ని తెచ్చిపెట్టాయి.

పవర్ ఫుల్ ఇంజిన్

ఈ పానిగేల్ వి2 ఎస్ మోడల్‌లో అత్యంత శక్తివంతమైన 955cc సూపర్ క్వాడ్రో V-ట్విన్ (V-twin) ఇంజిన్ ను ఉపయోగించారు. ఇది 155 bhp పవర్ ను, 104 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్ ను అందించారు. ఇందులో ఉన్న ‘దుకాటీ క్విక్ షిఫ్టర్’ (DQS) వల్ల గేర్లు చాలా వేగంగా, స్మూత్‌గా మార్చుకునే వెసులుబాటు ఉండనుంది. ట్రాక్ మీదైనా, హైవే మీదైనా ఈ ఇంజిన్ అందించే స్పీడ్ రైడర్లకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

అద్భుతమైన బ్రేక్ సిస్టమ్

Advertisement

ఇక ‘S’ వేరియంట్ కావడంతో దీనిలో అత్యంత నాణ్యమైన సస్పెన్షన్, బ్రేకింగ్ సెటప్ అందించారు. ముందు వైపు పూర్తిగా అడ్జస్ట్ చేసుకోగలిగే Öhlins NIX30 ఫోర్కులు, వెనుక వైపు Öhlins TTX36 మోనోషాక్ సస్పెన్షన్ అమర్చారు. అటు ముందు చక్రానికి Brembo M4.32 మోనోబ్లాక్ కాలిపర్లు కలిగిన డ్యూయల్ డిస్క్ బ్రేకులు, వెనుక సింగిల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇవి వేగంగా వెళ్తున్న బైక్‌ను కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా ఆపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Also Read: పల్సర్ ప్రేమికులకు తీపి కబురు.. సరికొత్త 125cc, 150cc మోడల్స్ వచ్చేస్తున్నాయ్..!

రేస్, స్పోర్ట్, స్ట్రీట్ మోడ్స్

మరోవైపు రైడర్ భద్రత కోసం అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ ఫీచర్లను ఈ బైక్ లో డుకాటీ జోడించింది. రేస్, స్పోర్ట్, స్ట్రీట్ అనే మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఇందులో తీసుకొచ్చారు. వీటన్నింటినీ స్టీరింగ్ వద్ద ఉన్న స్విచ్‌లతో కంట్రోల్ చేస్తూ.. బైక్‌లో ఉన్న 4.3 అంగుళాల రంగుల TFT డిస్‌ప్లేపై చూసుకోవచ్చు. మెుత్తంగా సరికొత్త లుక్, నమ్మశక్యం కాని వేగం, అత్యాధునిక సాంకేతికత కోరుకునే లగ్జరీ స్పోర్ట్స్ బైక్ ప్రియులకు.. ఈ ‘డుకాటీ పానిగేల్ వి2 ఎస్ ఎల్లో’ ఒక డ్రీమ్ బైక్‌గా నిలుస్తుందని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

Also Read: కంటిలో చిప్ పెడితే.. చూపు వచ్చేస్తుందట.. ఏమన్నా టెక్నాలజీనా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×