E-Paper
Advertisement

Rape Attempt : ఛీ..ఛీ.. వీడసలు తండ్రేనా..? కన్న కూతురిపై అత్యాచారం..

Rape Attempt : ఛీ..ఛీ.. వీడసలు తండ్రేనా..? కన్న కూతురిపై అత్యాచారం..
Advertisement

Rape Attempt : ఆడపిల్లలకు లోకంలో రక్షణ కరువైంది. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మత్రం మార్పు రావడం లేదు. వీధుల్లోనే కాదు ఇంట్లోనూ ఆడపిల్లలకు భద్రత లేకుండా పోయింది. రక్షణగా నిలవాల్సిన వాల్లే వావివరసలు మరిచి కామంతో కాటేస్తున్నారు. తాజాగా అలాంటి దారుణ ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది.

తాగిన మైకంలో ఓ తండ్రి వావివరసలు మరిచి కన్నకూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు సర్కిల్ పరిధిలోని బీబీ పేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరు గ్రామానికి చెందిన ఓ తండ్రి ఇంటికి కల్లు తెచ్చుకున్నాడు. తెచ్చిన కల్లును కూతురుకు తాగించి తను కూడా తాగాడు.

Advertisement

భార్య ఇంట్లో లేని సమయంలో అర్ధరాత్రి సమయంలో మైనర్ బాలిక అయిన కన్నకూతురు(16)పై లైంగిక దాడికి దిగాడు. మరుసటి రోజు తన తల్లికి వచ్చాక జరిగిన విషయాన్ని ఏడుస్తూ చెప్పింది. దీంతో ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలిసింది. తండ్రిని చితక్కొట్టడంతో తప్పించుకొని పారిపోయాడు.

తప్పించుకొని పారిపోయి వేరే గ్రామంలో తలదాచుకున్న తండ్రిని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఇంటికి పట్టుకొచ్చారు. కన్న కూతురిపై దారుణానికి పాల్పడిన తండ్రిని కామారెడ్డి ఇన్‌ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాస్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×