E-Paper
Advertisement

Manipur : మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. భద్రతా బలగాలపై మిలిటెంట్ల బాంబు దాడి..

Manipur : ఈ శాన్య రాష్ట్రం మణిపుర్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లోని మోరేలో భద్రతా బలగాల పోస్ట్‌పై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. బాంబులు, రాకెట్‌ ఆధారిత గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలొ పోలీసు కమాండో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో కమాండో పోస్ట్‌ వద్దనున్న పలు వాహనాలు ధ్వంసమైనట్లు వెల్లడించాయి. మిలిటెంట్ల దాడిని భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి. ప్రస్తుతం భీకర కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల మోరే ప్రాంతంలో ఓ పోలీసు అధికారి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెండు రోజుల కిందట కుకీ గ్రూప్‌లు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. మోరే నుంచి రాష్ట్ర పోలీసులను పంపించాలని డిమాండ్‌ చేశాయి. ఈ ఆందోళనలు జరిగిన రోజుల వ్యవధిలోనే తాజాగా కమాండ్‌ పోస్ట్‌పై దాడి జరగడం గమనార్హం. ఈ దాడికి పాల్పడింది కుకీ మిలిటెంట్లేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

మణిపుర్‌లో గతేడాది కొన్ని నెలల పాటు తీవ్ర ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ హింసాత్మక ఘటనల్లో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొంటున్న వేళ.. మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×