E-Paper
Advertisement

fake rs 500 Notes: నిజామాబాద్ జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 417 నోట్లు

fake rs 500 Notes: నిజామాబాద్ జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 417 నోట్లు
Advertisement

fake rs 500 Notes: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో దొంగ నోట్ల కలకలం రేగింది. బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు వచ్చిన ఒక రైతు వద్ద భారీ స్థాయిలో నకిలీ నోట్లు బయటపడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

జలాల్‌పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు, తాను తీసుకున్న క్రాప్ లోన్  తిరిగి చెల్లించడానికి వర్ని మండల కేంద్రంలోని బ్యాంకుకు వెళ్లారు. ఆయన తన వద్ద ఉన్న రూ. 2,08,500 నగదును క్యాషియర్‌కు అందజేశారు. నోట్లను లెక్కించే సమయంలో అనుమానం వచ్చిన క్యాషియర్, వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా అవి నకిలీవని తేలింది. సాయిలు తెచ్చిన నగదులో 417 నోట్లు  నకిలీవని బ్యాంక్ అధికారులు గుర్తించారు.

Advertisement

వెంటనే స్పందించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. వర్ని ఎస్ఐ రాజు ఘటనా స్థలానికి చేరుకుని, ఆ నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అమాయక రైతు వద్దకు ఇన్ని నకిలీ నోట్లు ఎలా వచ్చాయి? ఆయనకు ఈ డబ్బును ఎవరు ఇచ్చారు? దీని వెనుక ఏదైనా అంతరాష్ట్ర దొంగ నోట్ల ముఠా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. భారీ మొత్తంలో దొంగ నోట్లు బయటపడటంతో వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగదు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

ALSO READ: Tirupati district: కొడుకుపై ప్రేమ.. శ్మశానంలో సీసీ కెమెరాలు పెట్టించిన తండ్రి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×