E-Paper
Advertisement

షూటింగ్‌లో సరికొత్త రికార్డు.. ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు!

షూటింగ్‌లో సరికొత్త రికార్డు.. ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు!
Advertisement

Esha Singh: ISSF ప్రపంచ కప్-2026 షూటింగ్ పోటీల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన మన హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్‌పై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇషా ఏకంగా 43 హిట్స్ సాధించి, ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలోనే ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి కొనియాడారు.

మన నగరానికి చెందిన ఇషా సింగ్ చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించడం వెనుక ఆమె అంకితభావం, కఠినమైన క్రమశిక్షణ, పట్టుదల ఉన్నాయని సీఎం గుర్తుచేశారు. ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆమె ఒక నిజమైన స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రశంసించారు. ఇషా ప్రదర్శించిన ఈ అసాధారణ ప్రతిభ దేశంలోని ఎందరో క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, భారత క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఒక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Advertisement

అంతర్జాతీయ వేదికపై మన తెలంగాణ గడ్డ కీర్తిని, దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఇషా సింగ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఆమె మరెన్నో అద్భుత విజయాలు సాధించి, దేశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Also Read: ఒకవైపు స్పీచ్‌లు.. మరోవైపు రికార్డింగ్ డాన్సులు.. మహానాడుపై రోజా సెటైర్లు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×