E-Paper
Advertisement

ప్ర‌భుత్వ ఆస్తుల ధ్వంసం.. శిక్ష‌లు.. సెక్ష‌న్ల‌పై ఆరెస్ ప్ర‌వీణ్‌తో శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించాలి.. భ‌వ‌న్‌కు విన‌తుల తాకిడి!

ప్ర‌భుత్వ ఆస్తుల ధ్వంసం.. శిక్ష‌లు.. సెక్ష‌న్ల‌పై  ఆరెస్ ప్ర‌వీణ్‌తో  శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించాలి.. భ‌వ‌న్‌కు విన‌తుల తాకిడి!
Advertisement

కాబోయే హోం మినిష్ట‌ర్ క‌దా ఆరెస్ ప్ర‌వీణ్ కుమార్‌. మాజీ ఐపీఎస్ అధికారి కూడానాయే. నేర‌ము, శిక్ష‌, సెక్ష‌న్లు.. ఇవ‌న్నీ బాగా తెలిసి ఉన్నోడు. ఇండియ‌న్ పీన‌ల్ కోడ్లు కంఠ‌తా వ‌చ్చినోడు. అందుకే మొన్న బండి భ‌గీర‌థ్ విష‌యంలో మొత్తం చ‌ట్టాల‌న్నీ వ‌ళ్లెవేశాడు. అక్క‌డేం జ‌రిగిందో.. జ‌ర‌గ‌బోతుందో అంతా ఊహించేశాడు. దానికి శిక్ష‌లు ఎలా ఉండాలె? పోలీసులేం చేశారు? ఎంత మంది నాకా బంధీ చేస్తున్నారు? అస‌లు ఎంత మంది ప్ర‌ధాని సెక్యూరిటీలో ఉన్నారు? పోలీసుల సంఖ్య ఎంత‌? ఇవ‌న్నీ గ‌ణాంకాల‌తో స‌హా చెప్ప‌గ‌లిగినోడు. బ‌హుశా ఈ అంశాల‌న్నీ సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్‌కు కూడా తెలుసో లేదో. అంత‌లా చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న ఉండి. తెలంగాణ పోలీస్ వ్య‌వ‌స్థ‌పై ప‌ట్టున్న లీడ‌ర్ అవ‌స‌రం అర్జెంటుగా ప‌డింది మ‌ల్లోసారి. ఎందుకంటారా? జ‌ర బాల్క సుమ‌న్‌కు క్లాస్ తీసుకోవాలె.

ఆయ‌న మాట‌ల‌తో ప్ర‌భావితులై.. మిలిటెంట్ ఉద్య‌మాల‌కు, విధ్వంసాల‌కు తెగ‌బ‌డేందుకు సిద్దంగా ఉన్న గులాబీ సైన్యానికి స్పెషల్ క్లాసులు తీసుకుని చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలె. శిక్ష‌లు వివ‌రించాలె. సెక్ష‌న్లు తెలియ‌జేయాలె. ఇది కూడా ఆయ‌న బాధ్య‌త‌నే క‌దా! రైలు ప‌ట్టాలు కోయాలె.. ప్ర‌భుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలె.. కార్యాల‌యాలు త‌గుల బెట్టాలె! ఇలాంటి ఉన్మాద‌, హింసాప్రేరిత నినాదాలు, పిలుపులు ఇచ్చే లీడ‌ర్లు స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే అరాచ‌క శ‌క్తులు కాదా? అందుకే ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్.. తెలంగాణ భ‌వ‌న్‌లో ప్ర‌త్యేకించి ఓ మూడు నాలుగు రోజులు దీనిపైనే ప్ర‌త్యేక శిక్ష‌ణా త‌ర‌గ‌తులు… అవ‌గాహ‌నా క్లాసులు తీసుకోవాల‌నే డిమాండ్ పెరుగుత‌న్న‌ది. దీనికి ద‌గ్గ‌రుండి మ‌రీ కేటీఆర్ .. ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌ను ప్రోత్స‌హించాల‌ని, ఈ క్లాసుల‌కు బాల్క సుమన్ హాజ‌ర‌య్యేలా చూడాల‌ని కూడా కోరుతున్నారు.

Advertisement

వీటిపై బీఆరెస్ ప్ర‌త్యేకంగా త‌న పార్టీ ఫండ్ నుంచి కొంత సొమ్మును వెచ్చించి.. పోస్ట‌ర్లు కూడా అతికించాల‌ని విన‌తులు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వ ఆస్తులు ధ్వంసం చేయరాదు.. రైలు ప‌ట్టాలు కోయ‌రాదు.. స‌ర్కార్ ఆఫీసులు కాల‌బెట్ట‌రాదు.. అని హితోక్తుల‌తో కూడిన నినాదాలు ఉండేలా.. ఏఐల‌తో కూడిన గ్రాఫిక్స్ ఫోటోలు వాడి జ‌నాల‌ను కూడా ఈ విష‌యంలో అవ‌గాహ‌న ప‌రిచి, చైత‌న్య ప‌ర‌చాల‌నే డిమాండ్ సెగ కూడా తెలంగాణ భ‌వ‌న్‌కు తాకుతోంద‌ట‌. ప్ర‌త్యేకంగా ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌తో వీడియోలు తీపించి.. వాటిని సోషల్ మీడియాలో కూడా విడుద‌ల చేయ‌డం ద్వారా .. యువ‌త చైత‌న్యం కావ‌డంతో పాటు.. భ‌విష్య‌త్తులో ఆయ‌నే హోం మినిష్ట‌ర్‌గా అర్హుడని ఈ సంద‌ర్భంగా అంద‌రి చేత ఒప్పంచి త‌న నిర్ణ‌యం స‌రైదేన‌ని అంద‌రితో అనిపించే చాన్సు కూడా ఉంద‌ని కేటీఆర్‌కు సూచిస్తున్నారు ఆయ‌న శ్రేయోభిలాషులు.

ఈ క్లాసుల నిర్వ‌హ‌ణకు మంచిగా ప్రిపేరై రావాల్సిందిగా ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌కు సందేశాలు పంపుతున్నార‌ట‌. లేదంటే చ‌ట్టాల ప‌ట్ల అపార‌మైన అనుభ‌వం ఉన్న సీనియ‌ర్ల వ‌ద్ద ముందుగా ఓ మూడు రోజుల పాటు ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌ను కూడా అవ‌గాహ‌న పెంచుకుని మ‌రీ శిక్ష‌ణా త‌ర‌గ‌తులకు వ‌స్తే.. అది గులాబీద‌ళానికి మ‌రింత మేలు చేస్తుంద‌ని, లేదంటే వారు ఫ్యూచ‌ర్లో.. బాల్క మాట‌ల‌కు బ‌లై.. కుటంబాల‌ను రోడ్డు పాలు చేసి.. వీరు జైలు పాల‌యి.. జీవితం అగ‌మ్యగోచ‌రంమై. ఆత్మ‌హ‌త్య‌లే శ‌ర‌ణ్య‌మై.. యువ‌త బ‌తుకులు చెదులు బారిపోయి.. అన్యాయం జ‌రుగుతుంద‌ని,త‌మ వేద‌న‌ను ప‌ట్టించుకోవాల‌ని, అర‌ణ్య రోధ‌న‌లా చేయొద్ద‌ని వేడుకుంటున్నారు. దీనిపై ఇంకా కేటీఆర్ నుంచి గానీ, తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల నుంచి గానీ ఎలాంటి స్పంద‌న రాలేదు. బ‌హుశా ఫామ్‌హౌజ్‌లోని వార్ రూంలో వాడివేడీ చ‌ర్చ జ‌రుగుతుండొచ్చ‌ని అభిజ్ఞ‌వ‌ర్గాల బోగ‌ట్టా!

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×