E-Paper
Advertisement

Durgam Cheruvu: దుర్గం చెరువుపై హైడ్రా ఫోకస్.. మురుగు నీరు కలిపితే సహించేది లేదు!

Durgam Cheruvu: దుర్గం చెరువుపై హైడ్రా ఫోకస్.. మురుగు నీరు కలిపితే సహించేది లేదు!
Advertisement

Durgam Cheruvu: మాదాపూర్ గుట్టల్లో ఉన్న దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా దృష్టి పెట్టింది. మురుగు నీరు నేరుగా చెరువులోకి చేరడాన్ని హైడ్రా తీవ్రంగా ఖడించింది. దుర్గం చెరువులో గుర్రపు డెక్క వ్యాప్తి చెందడం.. దుర్గంధంగా మారడంపట్ల మీడియా కథనాలు, స్థానికుల నుంచి హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ మంగళవారం దుర్గం చెరువును పరిశీలించారు. దుర్గం చెరువులోని సగభాగం వరకూ గుర్రపు డెక్క వ్యాపించడానికి గల కారణాలను తెలుసుకున్నారు.

ఎస్‌టీపీలు ఉన్నప్పటికీ వరదు కాలువ ద్యార మురుగు నీరు నేరుగా దుర్గం చెరువులోకి కలపడం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌టీపీలకు వెళ్లే మురుగు నీరు అధికంగా ఉండడంతో ఇటువైపు మల్లించాల్పి వచ్చిందని అక్కడ ఇరిగేషన్ ఇంజినీర్లు చెప్పగా అది సరికాదన్నారు. ఎస్‌టీపీల సామర్థ్యానికి మించిన మురుగు నీరు వస్తే మురుగు కాలువకు మళ్లించాలి కాని.. నేరుగా చెరువులోకి ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఒక వైపు నేరుగా మురుగు నీరు వదిలేయం ఏంటని మండిపడ్డారు.

Advertisement

చెరువును అభివృద్ధి చేయడం అంటే పైపై మెరుగులు దిద్దడం కాదని దుర్గం చెరువు పనులు చేపట్టిన రహేజా సంస్ధ ప్రతినిధులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రశ్నించారు. చెరువులోకి మురుగు నీరు కలవడం గుర్రపు డెక్క వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి మీ వైపు చేసిన ప్రయత్నాలు ఏంటని అడిగారు.

జీహెచ్ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ శాఖ, రహేజా మైండ్‌స్పేస్, ఎస్‌టీపీల నిర్వహణ భాద్యతలు చేపట్టిన రాంకీ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం , బాధ్యత పడకపోవడమే దుర్గం చెరువు దుర్గంధానాకి కారణమని హైడ్రా కమిషనర్ తెలిపారు. చుట్టుపక్కల మురుగు నీరంతా ఎస్‌టీపీ లైన్లోకి వెళ్లేలా జాగ్రత్త పడాల్సిన సంబంధిత అధికారులు ఆ దిశగా పని చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌టీపీల వద్ద మురుగు నీరు శుభ్రం అయిన తర్వాత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకోసం పీసీబీకి పంపాలని హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించారు.

Advertisement

దుర్గం చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం హైడ్రా కార్యాలయంలో చెరువు పరిరక్షణ బాధ్యాతలు చేపట్టిన అన్నీ సంస్థలతో హైడ్రా కమిషనర్ సమావేశమయ్యారు. వరద కాలువలోకి మురుగు నీరు వెళ్లకుండా పైపులైను డైవర్షన్ పనులు చేపట్టడానికి జలమండలికి ఉండే ఇబ్బందులను తొలగించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా. ఎం రమేష్‌తో మాట్లాడి ట్రాఫిక్ డైవర్షన్‌కు సహకరించాలని సూచించారు.

అలాగే.. ఇరిగేషన్, విద్యుత్, జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాధికారులతో కూడా మాట్లాడి మరుగునీరు దుర్గం చెరువులోకి చేరకుండా చేపట్టే పనులను వెంటనే చేపట్టిన రహేజా సంస్థ ప్రతినిధులతో కూడా మాట్లాడి ఇన్ ఆర్మిట్ మాల్, నెక్టర్ గార్డెన్స్ ఇలా పై భాగంలోని ఐటీ సంస్థల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులోకి కలవకుండా చెరువుకు ఆనుకుని పడమర వైపు కాలువను తవ్వేందుకు చర్యలు  తీసుకోవాలని సూచించారు.

ALSO READ:  కూకట్‌పల్లి లో దారుణం..! కంప్లైంట్ ఇచ్చిన వారానికే భర్తను లేపేసిన భార్య

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×