E-Paper
Advertisement

Telangana Rising 2047: ప్రపంచ వేదికపై సీఎం రేవంత్ కీలక ప్రసంగం.. ఏఐ యుగంలో తెలంగాణ రైజింగ్!

Telangana Rising 2047: ప్రపంచ వేదికపై సీఎం రేవంత్ కీలక ప్రసంగం.. ఏఐ యుగంలో తెలంగాణ రైజింగ్!
Advertisement

Telangana Rising 2047: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంపై తన విజన్‌ను చాటిచెప్పారు. ‘ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కంపెటిటివ్ నెస్’ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వినియోగించి పౌర సేవలను విప్లవాత్మకంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.

 రైతు భరోసా వంటి సబ్సిడీల ట్రాకింగ్, ఆస్తి పన్ను వసూళ్లు, మహిళా సంక్షేమ పథకాల అమలు, పట్టణ మున్సిపల్ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ఇప్పటికే ఏఐ పరిష్కారాలను అమలు చేస్తోందని సీఎం వివరించారు. ఏఐని సరైన దిశలో వినియోగిస్తే పాలనలో పారదర్శకత, వేగం పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

 అదునాతన ఏఐ యుగంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండలేవని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మరియు ముందస్తు చర్యలు చేపట్టడం అత్యవసరమని ఆయన నొక్కి చెప్పారు.  రాష్ట్ర భవిష్యత్తు కోసం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ముఖ్యమంత్రి ఈ వేదికపై ఆవిష్కరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్ ప్రస్తుతం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు (GCC) చిరునామాగా మారిందని, ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే మేధోవంతమైన వ్యవస్థలను నిర్మించక తప్పదని సీఎం పేర్కొన్నారు.

Advertisement

ఈ సమావేశంలో స్మార్ట్ ఫ్యాక్టరీలు, స్థిరమైన ఇంధన వ్యవస్థలు, స్మార్ట్ సిటీల నిర్మాణంపై అంతర్జాతీయ స్థాయి చర్చలు జరిగాయి. ఈ సదస్సులో ఈజిప్ట్ మంత్రి హస్సన్ ఎల్కహతీబ్, నోకియా సీఈఓ జస్టిన్ హోటార్డ్, హిటాచి సీఈఓ తోషియాకి టోకునాగా వంటి ప్రపంచ స్థాయి ప్రముఖులు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలను అభినందించారు.

Read Also: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల భారీ మోసం…. కరాటే కళ్యాణిపై దాడి.. ఎందుకంటే?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×