E-Paper
Advertisement

కరీంనర్‌లో ఓ కవికి దక్కిన జాతీయ స్థాయి అరుదైన గౌరవం..?

కరీంనర్‌లో ఓ కవికి దక్కిన జాతీయ స్థాయి అరుదైన గౌరవం..?
Advertisement

Karimnagar: స్వేచ్ఛ బ్యూరో: ప్రముఖ తత్వవేత్త, ప్రజాకవి బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ జాతీయ స్థాయి ‘ఆధ్యాత్మిక విజ్ఞాన జ్యోతి’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆదివారం కరీంనగర్‌లోని ఫిలిం భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పలు సంస్థల ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించి ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, శ్రీ విరాట్ విశ్వకర్మ ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. సత్యం గౌడ్ సామాజిక సేవలు, మానవ విలువల పరిరక్షణలో ఆయన కృషిని గుర్తించి ఈ గౌరవం దక్కింది.

మహోన్నత వ్యక్తిత్వం..

కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన డాక్టర్ వంగల శాంతి కృష్ణచార్య, ప్రముఖ నటులు ఆర్.ఎస్. నంద, న్యాయవాది కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ.. సత్యం గౌడ్ ఆధ్యాత్మిక ప్రసంగాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయని కొనియాడారు. ఆయనలోని అపార జ్ఞానం, సేవా భావం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సత్యం గౌడ్‌కు పట్టుశాలువా కప్పి, మెడల్ ధరింపజేసి ఉగాది జ్ఞాపికను అందజేశారు.

Advertisement

Also Read: గుడ్ న్యూస్ చెప్పిన ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!

యువతే దేశానికి మూలస్తంభం

పురస్కార గ్రహీత డాక్టర్ నాగుల సత్యం గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మనసును అదుపులో ఉంచుకుని నిర్మలమైన జీవితాన్ని గడపాలన్నారు. నేటి యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి నవ సమాజ నిర్మాణానికి పునాదులుగా నిలవాలని పిలుపునిచ్చారు. కళాకారులను, కవులను నిరంతరం ప్రోత్సహిస్తున్న నిర్వాహకులు పోలోజు రాజకుమార్ సేవలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు వలబోజు మోహన్ రావు, బిడ్డల ప్రశాంత్, యాదగిరి గౌడ్ తదితర ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: సత్తుపల్లిలో దారుణం.. ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×