E-Paper
Advertisement

Delhi Blast: కదులుతున్న కారులో బ్లాస్ట్.. ఉగ్రవాదులు ఎలా ప్లాన్ చేశారంటే?

Delhi Blast: కదులుతున్న కారులో బ్లాస్ట్..   ఉగ్రవాదులు ఎలా ప్లాన్ చేశారంటే?
Advertisement

Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ రోజు సాయంత్రం జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కి పెరిగింది. ఈ దుర్ఘటనలో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, ఒకఅనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ఈ భయానక ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి పేలుడుకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. అంతకుముందు, ఘటన జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన

Advertisement

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. “ఈ సాయంత్రం (నవంబర్ 10) 7 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా కొంతమంది పాదచారులు గాయపడ్డారని, కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పేలుడు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీ (NSG), ఎన్‌ఐఏ (NIA) బృందాలు.. ఫోరెన్సిక్ (FSL) బృందంతో కలిసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి. సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.’’ అని అన్నారు.

‘‘నేను ఢిల్లీ సీపీ (CP)తో, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌ఛార్జ్‌తో కూడా మాట్లాడాను. ఢిల్లీ సీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌ఛార్జ్ ఇద్దరూ ఘటనా స్థలంలోనే ఉన్నారు. మేము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతాం. అన్ని అంశాలను తక్షణమే దర్యాప్తు చేసి, ఫలితాలను ప్రజల ముందు ఉంచుతాం. ” అని అమిత్ షా పేర్కొన్నారు.

Advertisement

కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఎల్‌ఎన్‌జేపీ (LNJP) ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Read Also: Delhi Blast: ఢిల్లీ పేలుడు.. 8 మంది మృతి.. దేశవ్యాప్తంగా హై అలర్ట్

ఢిల్లీ పోలీస్ కమీషనర్ (CP) ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. సాయంత్రం సుమారు 6.45 గంటల సమయంలో, ఎర్రకోట సమీపంలోని సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయని తెలిపారు. ఆ సమయంలోనే ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఒక కారులో పేలుడు సంభవించిందని, ఆ కారుకు సమీపంలో ఇతర వాహనాలు కూడా ఉన్నట్లు చెప్పారు. పేలుడుకు గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×