E-Paper
Advertisement

OTT Movie : లైఫ్ లోనే ఫస్ట్ డేట్… కట్ చేస్తే దెయ్యంగా మారే అబ్బాయి… అదిరిపోయే హర్రర్ కామెడీ మూవీ

OTT Movie : లైఫ్ లోనే ఫస్ట్ డేట్… కట్ చేస్తే దెయ్యంగా మారే అబ్బాయి… అదిరిపోయే హర్రర్ కామెడీ మూవీ
Advertisement

OTT Movie : హారర్ జానర్ అంటేనే ఆత్మలు, చేతబడులతో వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు ఆత్మల కాన్సెప్ట్ తో వచ్చినా, సరదాగా సాగిపోతుంటాయి. కామెడీ వైబ్ ని ఇస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ప్రియుడి ఆత్మ తిరిగి వచ్చి తన ప్రియురాలిని కలుస్తుంది. ఆ తరువాత ఆమె లైఫ్ సెట్ చేసే పనిలో ఉంటుంది. ఈ మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సినిమా హాలిడే సీజన్‌లో ఫ్యామిలీలు చూడడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘గోస్టింగ్: ది స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్’ (Ghosting the spirit of christmas) 2019 వచ్చిన ఒక క్రిస్మస్ ఫాంటసీ రొమాంటిక్ కామెడీ చిత్రం. దీనికి థెరెర్సా బెన్నెట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఐషా డీ, కిమికో గ్లెన్, కేండ్రిక్ సాంప్సన్, జాజ్ రేకోల్, మిస్సి పైల్ లిసాగే హామిల్టన్ నటించారు. ఈ చిత్రం 2019డిసెంబర్ 4న రిలీజ్ అయింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండిబిలో 6.2/10 రేటింగ్ ని పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జెస్ అనే యువకుడు ఒక రోజు ప్రియురాలితో ఉండగా,  ఒక కారు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. కానీ ఆత్మగా మారి మళ్లీ ఈ లోకంలోకి వచ్చేస్తాడు. క్రిస్మస్ సమయంలో మాత్రమే అతని ఆత్మ భూమి మీద ఉంటుంది. ఇక అతని మిషన్ తన గర్ల్‌ఫ్రెండ్ కారాను సేవ్ చేయడం. కారా జెస్ చనిపోయాక డిప్రెస్డ్ అయి, క్రిస్మస్ స్పిరిట్ పూర్తిగా కోల్పోయింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడం మానేసింది. ఆమె ఇప్పుడు ఒంటరిగా గడుపుతుంటుంది. జెస్ ఘోస్ట్‌గా కారాను ఫాలో అవుతాడు. ఆమెకు కనిపించకపోయినా ఆమె లైఫ్‌లో ఇంటర్‌ ఫియర్ అవుతాడు. చిన్న చిన్న మిరాకిల్స్ చేసి, ఆమెను లియామ్‌ అనే మంచి వ్యక్తితో మళ్లీ లవ్‌లో పడేస్తాడు.

Read Also : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Advertisement

జెస్ ఘోస్ట్‌గా ఉండే టైమ్ తక్కువగా ఉంటుంది. క్రిస్మస్ ఈవ్ మధ్యరాత్రి వరకు మాత్రమే భూమిపై ఆత్మ ఉంటుంది. ఆ టైమ్‌లో కారా హ్యాపీ అయితేనే అతను పీస్‌ఫుల్‌గా హెవెన్‌కు వెళ్తాడు. కారా చుట్టూ విచిత్రమైన సంఘటనలు జరగడం చూసి, ఆమె మొదట భయపడుతుంది. కానీ తర్వాత జెస్ స్పిరిట్ ఉందని రియలైజ్ అవుతుంది. చివర్లో కారా లియామ్‌తో హ్యాపీగా సెటిల్ అవుతుందా ? జెస్ హెవెన్‌కు వెళ్తాడా ? ఈ కథ సుఖాంతంగా ముగుస్తుందా ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ కామెడీ మూవీని చూసి తెలుసుకోండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×