E-Paper
Advertisement

పునర్విభజన ముసుగులో రిజర్వేషన్లకు పాతర.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు

పునర్విభజన ముసుగులో రిజర్వేషన్లకు పాతర.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు
Advertisement

Delimitation Bill: స్వేచ్చ బ్యూరో: డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, నియంత్రత్వాన్ని ప్రజాస్వామ్యం ఓడించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని రాజ్ బహదూర్ హాల్లో సీపీఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమితి కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వ మోడీ, అమిత్ షా ద్వయం నియంతృత్వంగా డిలీమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడం.. దాన్ని ప్రతిపక్షాలు అన్ని ఏకమై బిల్లుని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాయన్నారు. డీలిమిటేషన్ బిల్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా నిలుస్తోందన్నారు.

ప్రాధాన్యత ఇవ్వాలనే కుట్ర..

ప్రజల ప్రాతినిధ్యాన్ని సమానంగా కల్పించాల్సిన ప్రక్రియను రాజకీయ లాభాల కోసం వక్రీకరించే ప్రయత్నంగా ఈ బిల్లు కనిపిస్తోందని ఏద్దేవా చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ అనేది జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం కోసం ఉండాలి, అయితే ఈ బిల్లు ద్వారా కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలపై వివక్ష చూపుతూ, ఉత్తర భారత రాష్ట్రాలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే కుట్ర అని వారు అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు సమాన విలువ కలిగి ఉండాలని, కానీ ఈ బిల్లు అమలు అయితే ప్రాంతాల మధ్య అసమానతలు మరింత పెరిగి, సమతుల్యత కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, పారదర్శకత లేకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం అప్రజాస్వామికమన్నారు.

Advertisement

Also Read: రంగారెడ్డి జిల్లాలో రగులుతున్న పదవుల వేట.. ఇక అందరి చూపు అటువైపే..?

రాబోయే రోజుల్లో..

మహిళా బిల్లును 2023లోనే పార్లమెంట్ ఆమోదం పొందిందని మళ్ళీ నేడు పునర్వీభజన పేరుతో మహిళా బిల్లును ఉపసంహారించుకోవడం వెనుకాల బీజేపీ అసలు కుట్ర మహిళా రిజర్వేషన్ ను అడ్డుకోవడమేననిమండిపడ్డారు. బీజేపీ చేసే అబద్దపు ప్రచారాన్ని అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పార్టీగా పూర్తి మద్దతు ఉందని స్థానిక నాయకత్వం కూడా పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కొరకు స్థానిక సమస్యల పై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తే పార్టీ బలోపేతం అవుతుందని,కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబడే స్థానాలపై దృష్టి సారించి గెలిచే విదంగా ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీఎస్ బోస్, లక్ష్మి ,ఉమా మహేష్, దామోదర్ రెడ్డి,కల్లూరు ధర్మేంద్ర , సాయిలు గౌడ్, స్వామి, శంకర్,కృష్ణ,హరినాథ్ రావ్,రచ్చ కిషన్,శంకర్ రావ్,సత్య ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

Also Read: బచ్చన్నపేటలో బెల్ట్ షాపుల జాతర.. వైన్స్‌లో లేని స్టాక్ అక్కడ ఫుల్..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×