E-Paper
Advertisement

చిన్న పిల్లల చుట్టూ తిరిగే దుష్ట శక్తులు… పట్టపగలే భయపెడుతున్న హారర్ మూవీ

చిన్న పిల్లల చుట్టూ తిరిగే దుష్ట శక్తులు… పట్టపగలే భయపెడుతున్న హారర్ మూవీ
Advertisement

Horror Thriller OTT : ఒక సరికొత్త హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. సాధారణంగా దెయ్యం సినిమాలు అంటే చీకటి గదులు, పాడుబడ్డ బంగ్లాలు ఉంటాయి కానీ, ఇందులో మాత్రం అందమైన పార్కులో, పగటి వెలుతురులోనే భయాన్ని పుట్టించేలా తీశారు. ఒక అతీత శక్తి పిల్లలందరినీ తన గుప్పిట్లో పెట్టుకుని, వాళ్ళని వింత జీవుల్లా మార్చేయడం ఈ సినిమాలో హైలైట్. 1 గంట 31 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా హారర్ ఫ్యాన్స్ బెస్ట్ ఛాయిస్ గా చెప్పుకోవచ్చు.

టుబి (Tubi) ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ కెనడియన్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘హైవ్’ (Hive). ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ దీని దర్శకుడు ఫెలిపే వర్గాస్. ఆయన తీసిన ఒక వైరల్ షార్ట్ ఫిలింకు వచ్చిన క్రేజ్ చూసి, ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘టుబి’ (Tubi) దీనిని ఫీచర్ ఫిలింగా నిర్మించింది. ఇందులో మార్వెల్ నటి సోచిట్ల్ గోమెజ్ లీడ్ రోల్ చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ, ఒక కొత్త రకమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా, 2026 ఏప్రిల్ 17న ఈ చిత్రం నేరుగా టుబి (Tubi) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో విడుదలైంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సాషా అనే అమ్మాయి సిటీకి దూరంగా ఉండే ఒక ఇంట్లో కేర్ టేకర్ గా జాయిన్ అవుతుంది. అయితే ఒక పెద్ద పార్కులోకి తను చూసుకోవాల్సిన ఒక చిన్న పిల్లాడిని తీసుకుని వెళ్తుంది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న టైంలో, కన్ను మూసి తెరిచేలోపు ఆ పిల్లాడు మాయమైపోతాడు. పిల్లాడి కోసం దిక్కులు చూస్తూ వెతుకుతుంటే, ఆ ఏరియా అంతా ఎందుకో తేడాగా అనిపిస్తుంది. అక్కడ ఆడుకునే మిగతా పిల్లల మొహాల్లో కూడా ఏదో తెలియని వింత భయం, విచిత్రమైన చూపులు కనిపిస్తాయి. మెల్లగా చీకటి పడుతుంటే అసలు విషయం బయటపడుతుంది. ఆ పార్కులో ఉండే పిల్లలందరినీ ఒక వింతైన శక్తి తన గుప్పిట్లో పెట్టుకుంటుంది.

ఆ పిల్లలు మనుషుల్లా కాకుండా, ఏదో పురుగుల గుంపులాగా ప్రవర్తిస్తూ సాషాను చుట్టుముట్టేస్తారు. సాషాకు ఏం చేయాలో అర్థం కాక చుక్కలు కనిపిస్తాయి. కానీ ఎలాగైనా ఆ పిల్లాడిని కాపాడాలని తన తమ్ముడు మార్కోని కూడా పిలిపించుకుని, ఆ భయంకరమైన దుష్ట శక్తితో పోరాటానికి దిగుతుంది. అక్కడ ఉండే ఆ వింత శక్తి పిల్లల తల్లిదండ్రులను కూడా తన మాయలో కలిపేసుకోవాలని చూస్తుంటుంది. ఆ దెయ్యం శక్తి నుండి, ఆ వింత పిల్లల గుంపు నుండి సాషా ఎలా తప్పించుకుంది ? ఆ పిల్లాడిని సేఫ్ గా ఇంటికి తెచ్చిందా ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : ఆమె చూపు పడితే నాశనమే… ప్రేమిస్తే చావు మేళం పక్కా… భయపెడుతున్న హారర్ మూవీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×