E-Paper
Advertisement

CPI: కొత్తగూడెంపై ఎర్రజెండా ఎగురవేసింది.. పట్టు నిలుపుకున్న సీపీఐ

CPI: కొత్తగూడెంపై ఎర్రజెండా ఎగురవేసింది.. పట్టు నిలుపుకున్న సీపీఐ
Advertisement

CPI: కొత్తగూడెం కార్పొరేషన్ పై సీపీఐ జెండా ఎగురవేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సత్తా చాటింది. ఎప్పుడు వార్డులకే పరిమితం అయిన సీపీఐ ఈసారి కార్పొరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకుంది. కార్పొరేషన్ లోని 60 వార్డులు ఉండగా ఒంటరిగా పోటీ చేసి అందులో 22 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ 22 వార్డుల్లో, బీఆర్ఎస్ 8 స్థానాల్లో, బీజేపీ ఒక స్థానం, సీపీఎం1, 6స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. మేజిక్ ఫిగర్ 31 కాగా సీపీఐ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియే ఓటుతో కొత్తగూడెంను సీపీఐ కైవసం చేసుకోనుంది.

Also Read:GHMC: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ 

కాంగ్రెస్ తో కుదరని పొత్తు

Advertisement

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీని సీపీఐకి కేటాయించగా విజయం సాధించింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుకోసం చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారు. అయితే అందుకు కాంగ్రెస్ ససేమిరా అనడం, సీట్ల సర్దుబాటుగాక పోవడంతో సీపీఐ ఒంటిరిగానే బరిలోకి దిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక ఫోకస్ పెట్టి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజాసమస్యలపై గళం ఎత్తారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది.

సీపీఐ కేడర్ లో జోష్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ నుంచి వామపక్షాలు ఒక్క మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకోలేదు. కేవలం వార్డులకు మాత్రమే పరిమితం అయింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభావం చూపారు తప్ప గడిచిన పదేళ్లలో సత్తా చాటలేకపోయారు. కామ్రేడ్ల ప్రభావం ఒక పోయిందని అనుకున్న తరుణంలో కొత్తగూడెం కార్పొరేషన్ లో ఒంటరిగా పోటీ చేసి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొవడం కొన్ని మున్సిపాలిటీల్లో కొన్ని డివిజన్లలో విజయం సాధించడంతో పార్టీ లో జోష్ నెలకొంది. ఇది రాబోయే ఎన్నికలకు నాంది అని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Advertisement

Also ReadJangaon Municipal Elections: జనగామ మున్సిపాలిటీలో హంగ్.. ఎక్స్ ఆఫిషియో ఎవ్వ‌రెవ్వ‌రు?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×