// // Vitamin b12 Deficiency: అలసటగా ఉంటున్నారా? విటమిన్ B12 తగ్గిందేమో! -->
E-Paper
Advertisement

Vitamin b12 Deficiency: విటమిన్ B12 లోపాన్ని గుర్తిండమెలా? ఈ సమస్య తగ్గాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?

Vitamin b12 Deficiency: విటమిన్ B12 లోపాన్ని గుర్తిండమెలా? ఈ సమస్య తగ్గాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?
Advertisement

Vitamin b12 Deficiency: ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి ఓ యంత్రంలా మారిపోతున్నాడు. ఈ క్రమంలో మంచి ఆహారం తీసుకోక.. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వక తెలియకుండానే అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నాము. ముఖ్యంగా సరైన పోషకాహారం తీసుకోవడంలో చాలామంది విఫలమవుతున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది విటమిన్ బి12. మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, నరాల ఆరోగ్యం, DNA సంశ్లేషణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఏ మాత్రం తేడా వచ్చినా విటమిన్ 12 లోపం కలిగించే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం లేదా జీర్ణక్రియలో లోపాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.

శరీరం పంపే ముందస్తు సంకేతాలు..

మన శరీరంలో బి12 స్థాయిలు తగ్గినప్పుడు అది రకరకాల రూపాల్లో మనకు సంకేతాలను పంపిస్తుంది. సాధారణంగా ఏదైనా చిన్న గాయం అయితే వెంటనే తగ్గిపోవాలి. కానీ బి12 లోపం ఉన్నవారికి గాయాలు మానడానికి చాలా టైం పడుతుంది. ఎర్ర రక్త కణాలు తగ్గడం వల్ల శరీర కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా మందగించి, రికవరీ ప్రక్రియ నెమ్మదిస్తుంది. అలాగే, చేతులు లేదా కాళ్లలో తరచూ సూదులతో గుచ్చినట్లు ఉండటం లేదా తిమ్మిర్లు రావడం వంటివి జరిగితే, అది మీ నరాల వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని చెప్పడానికి ముఖ్యమైన సూచన అన్నమాట.

Advertisement

Also Read: మీకు తెలుసా? ఈ దేశాల్లో ‘వాలంటైన్స్ డే’ నేరం.. ఎందుకంటే?

శారీరక, మానసిక మార్పులు..

కేవలం శారీరక శక్తి తగ్గడమే కాకుండా, బి12 లోపం మన మనసుపై కూడా ప్రభావం చూపుతుంది. కారణం లేకుండానే విపరీతమైన అలసట, బలహీన పడటం, ఆకలి మందగించి బరువు తగ్గడం వంటివి తలెత్తవచ్చు. దీంతోపాటు మతిమరుపు, ఏ పనిపైనా ఏకాగ్రత కుదరకపోవడం, చిరాకు, డిప్రెషన్ వంటి మానసిక స్థితిగతులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అది విటమిన్ లోపం వల్లే అని గ్రహించాలి. అలాగే కంటి చూపు మందగించడం కూడా దీని ప్రభావమే కావచ్చు.

కారణాలు ఏమిటంటే?

Advertisement

విటమిన్ బి12 లోపానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం, జీర్ణవ్యవస్థ పనితీరు. కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం తగినంతగా ఉత్పత్తి కానప్పుడు మనం తీసుకున్న ఆహారం నుండి బి12 గ్రహించబడదు. ముఖ్యంగా శాకాహారుల్లో ఈ లోపం ఎక్కువగా ఉంటుంది. బి12 సహజంగా జంతు సంబంధిత ఆహారాల్లోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అందుకే, ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ లోపాన్ని అధిగమించవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

⇒ పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

⇒ సమస్య తీవ్రతను బట్టి వైద్యులు సప్లిమెంట్స్ లేదా ఇంజెక్షన్లను సూచిస్తారు.

⇒ ఆహారంలో భాగంగా గుడ్లు, చేపలు, మాంసం, కాలేయం వంటివి చేర్చుకోవాలి.

⇒ శాకాహారులు పాలు, పెరుగు, పనీర్, పుట్టగొడుగులు, టోఫు వంటి పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

⇒ మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా విటమిన్ 12 సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

Also Read: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 4 తప్పులకు దూరంగా ఉండండి!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×