E-Paper
Advertisement

గో బ్యాక్ మోదీ అంటూ.. ప్రధాని పర్యటన పై కాంగ్రెస్ నిప్పుులు..!

గో బ్యాక్ మోదీ అంటూ.. ప్రధాని పర్యటన పై కాంగ్రెస్ నిప్పుులు..!
Advertisement

PM Visit: స్వేచ్ఛ బ్యూరో: దేశ ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొంతకాలంగా బీజేపీకి ధీటుగా బదులిస్తున్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా ప్రధాని పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, నిధుల కేటాయింపు అంశాలను తెరపైకి తెచ్చి కమలనాథులను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ​ప్రధాని రాకను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. గత ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా మూడు కీలక అంశాలపై హస్తం నేతలు క్లారిటీ డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర నిధులపై శ్వేతపత్రం..

​ స్థానిక సంస్థల్లో చట్టసభల్లో బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ల విషయంలో కేంద్రం వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ​అంతే గాక విభజన హామీల అమల్లో జాప్యం, జీఎస్టీ బకాయిలు, పెండింగ్‌లో ఉన్న కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. మరో వైపు దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలన్న డిమాండ్‌ను ప్రధాని ఎందుకు విస్మరిస్తున్నారో సమాధానం చెప్పిన తర్వాతే పర్యటించాలని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also read: బౌన్స్ అవుతున్న EMI లు.. బల్ధియా అధికారుల నిర్లక్ష్యానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బలి..!

బీజేపీని డ్యామేజ్ చేసే వ్యూహం..

​రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు బ్రేకులు వేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ దాడులను తీవ్రతరం చేసింది. క్షేత్రస్థాయిలో బీసీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు, బీజేపీని ‘బీసీ వ్యతిరేక పార్టీ’గా చిత్రించేందుకు సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ మొదలుపెట్టింది. “బీసీలకు న్యాయం చేయని ప్రధానికి మా గడ్డపై అడుగుపెట్టే హక్కు లేదు. నిధులు ఇవ్వకుండా, హక్కులు కల్పించకుండా కేవలం ఓట్ల కోసమే ఈ పర్యటనలు చేస్తున్నారు.” అని కాంగ్రెస్ ముఖ్య నేతలు విమర్శిస్తున్నారు.

పర్యటన ప్రభావం ఎలా ఉంటుంది?

Advertisement

​ఒకవైపు బీజేపీ పర్యటనను భారీ విజయవంతం చేయాలని చూస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ ఆ పర్యటన ఉద్దేశాన్ని నీరుగార్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. “గో బ్యాక్ మోదీ” నినాదాలతో క్షేత్రస్థాయిలో నిరసనలు తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ప్రధాని పర్యటనకు మరో ఐదు రోజుల సమయం గడువు ఉండగానే కాంగ్రెస్ నేతలంతా వరుసగా మోడీపై పొలిటికల్ ఎటాక్ దిగడం గమనార్హం. అయితే ఈ పొలిటికల్ వార్ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Also Read: దౌలతాబాద్‌లో దారుణం.. ఓ మహిళకు బైక్ పై లిఫ్ట్ ఇచ్చి నగలు చోరి..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×