E-Paper
Advertisement

ఓటీటీలో ఇరగదీస్తున్న థ్రిల్లర్ సిరీస్ లు… మలుపులు తిరుగుతూ పిచ్చెక్కించేలా ఉన్న స్టోరీలు

ఓటీటీలో ఇరగదీస్తున్న థ్రిల్లర్ సిరీస్ లు… మలుపులు తిరుగుతూ పిచ్చెక్కించేలా ఉన్న స్టోరీలు
Advertisement

Best Thriller Series on OTT : ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చాక థ్రిల్లర్ సినిమాలకు, సిరీస్‌లకు క్రేజ్ మామూలుగా లేదు. వెండితెరపై కంటే ఓటీటీలోనే ఒళ్లు గగుర్పొడిచే సస్పెన్స్ కథలు ఎక్కువగా సందడి చేస్తున్నాయి. మీరు ఇంట్లోనే కూర్చుని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా చేసే 5 అదిరిపోయే థ్రిల్లర్ సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటూ మిమ్మల్ని ఓ రేంజ్ లో థ్రిల్ చేస్తాయి.

1. ది జెంగాబురు కర్స్ (The Jengaburu Curse – 2023)

సోనీ లివ్ (SonyLIV) స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, భారతదేశపు మొట్టమొదటి క్లైమేట్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. ఒడిశాలోని గనుల తవ్వకం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. లండన్‌లో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేసే ప్రియా దాస్ (ఫరియా అబ్దుల్లా), తన తండ్రి ప్రొఫెసర్ దాస్ అదృశ్యమయ్యాడనే వార్త విని ఒడిశాకు వస్తుంది. ఆమె తన తండ్రి కోసం వెతకడం మొదలెట్టగానే, గనుల మాఫియా, కార్పొరేట్ శక్తులు, గిరిజనుల జీవితాల వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఆమెను ఉలిక్కిపడేలా చేస్తాయి. ప్రకృతిని మనం నాశనం చేస్తే అది మనల్ని ఎలా వెంటాడుతుందో ఈ సిరీస్ అద్భుతంగా చూపిస్తుంది.

2. ది నైట్ మేనేజర్ (The Night Manager – 2023)

Advertisement

అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ హాలీవుడ్ సిరీస్‌కు రీమేక్. ఒక హోటల్ మేనేజర్.. ప్రమాదకరమైన ఆయుధాల వ్యాపార సామ్రాజ్యంలోకి స్పైగా ఎలా వెళ్లాడు అనేది మెయిన్ ప్లాట్. విజువల్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కథలో వచ్చే మలుపులు, ముఖ్యంగా అనిల్ కపూర్ నటన మిమ్మల్ని కట్టిపడేస్తాయి. గూఢచారి కథలను ఇష్టపడేవారికి ఇది పక్కా క్రేజీ సిరీస్. జియో హాట్‌స్టార్ (Disney+ Hotstar)లో ఇది అందుబాటులో ఉంది.

3. షెహర్ లఖోట్ (Shehar Lakhot – 2023)

ఇందులో ఒక మనిషి తన గతాన్ని వదిలించుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ గతమే అతడిని వెతుక్కుంటూ వస్తుంది. ‘లఖోట్’ నగర నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. అవినీతి రాజకీయాలు, వ్యక్తిగత పగల చుట్టూ సాగే సిరీస్ఇది. దీని మేకింగ్ స్టైల్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ చివరలో వచ్చే ట్విస్ట్‌లు తర్వాతి ఎపిసోడ్ చూడకుండా ఉండనివ్వవు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఇది అందుబాటులో ఉంది.

4. దురంగా (Duranga – 2022)

Advertisement

ఈ కొరియన్ డ్రామా ‘ఫ్లవర్ ఆఫ్ ఈవిల్’ ఆధారంగా తెరకెక్కిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్. మీ పక్కనే ఉండే వ్యక్తి ఒక సీరియల్ కిల్లర్ అయితే ఎలా ఉంటుందో చూపించే స్టోరీ ఇది. పైకి ఎంతో మంచి భర్తలా, తండ్రిలా కనిపిస్తూనే లోపల ఒక భయంకరమైన గతాన్ని దాచిన మనిషి కథ ఇది. ఆ మనిషి భార్య ఒక పోలీస్ ఆఫీసర్ కావడం, ఆమె తన భర్త నిజస్వరూపాన్ని ఎలా కనిపెట్టిందనేది చాలా ఉత్కంఠగా సాగుతుంది. జీ5 (ZEE5)లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

5. ఇన్‌స్పెక్టర్ అవినాష్ (Inspector Avinash – 2023)

రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఇంటెన్స్ పోలీస్ డ్రామా ఇది. రణదీప్ హుడా ఈ సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్ అవినాష్ మిశ్రాగా జీవించేశాడు. 1990ల కాలంలో ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్లను ఏరిపారేయడానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేసే ఆపరేషన్లే ఈ కథ. యాక్షన్ సీక్వెన్స్‌లు, గన్‌ ఫైట్స్, ఇన్వెస్టిగేషన్ స్టైల్ మాస్ ఆడియన్స్‌కు బాగా నచ్చుతుంది. జియో హాట్ స్టార్ (Jio hotstar)లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఐదు సిరీస్‌లు కూడా వేటికవే ప్రత్యేకం. వీకెండ్‌లో టైమ్ పాస్ కోసం కాకుండా, బుర్రకి పని పెట్టే సస్పెన్స్ కావాలనుకుంటే వీటిని ఎంచక్కా చూసేయండి.

Read Also : ఆత్మల కేసులు ఇన్వెస్టిగేట్ చేసే దెయ్యాలు… అదిరిపోయే ఫాంటసీ అడ్వంచర్ భయ్యా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×