E-Paper
Advertisement

Telangana Congress: సర్కార్ స్ట్రాటజీతో మైండ్ బ్లాక్.. ప్రతిపక్షాలకు షాకిచ్చిన హస్తం పార్టీ..?

Telangana Congress: సర్కార్ స్ట్రాటజీతో మైండ్ బ్లాక్.. ప్రతిపక్షాలకు షాకిచ్చిన హస్తం పార్టీ..?
Advertisement

Telangana Congress: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు సర్కార్ అనుసరించిన స్ట్రాటజీతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయింది. తమకు మద్ధతిస్తారని భావించిన కొందరు ఇండిపెండెంట్లు కూడా బీఆర్ ఎస్ ను తిరస్కరించి, కాంగ్రెస్ కుమద్ధతు తెలిపారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి(CM REvanth Reddy) ఆదేశాలనుగుణంగా మంత్రులు సమర్ధవంతంగాసలహాలను అమలు చేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికకు కొన్ని గంటల ముందు వరకు బీఆర్ ఎస్ తో సన్నిహితంగా ఉన్న కౌన్సిలర్లు, కార్యాలయంలోకి ఎంట్రీ కాగానే కాంగ్రెస్ వైపు నిలిచారు. దీంతో రాష్​ట్ర వ్యాప్తంగా 87 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, 5 కార్పొరేషన్లను సొంతం చేసుకున్నది. ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ ఎస్ కు నష్టంగానే రాజకీయ నేతలు చెప్తున్నారు.

నిజామాబాద్ సైతం.. ఈ ఎంపీకి హస్తం నేతలు షాక్..

నిజామాబాద్ ,మంచిర్యాల,మహబూబ్‌నగర్,రామగుండం ,నల్గొండ కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. మంచిర్యాల, రామగుండం, మహబూబ్‌నగర్‌, నల్గొండ నగరపాలికల్లో స్పష్టమైన మెజారిటీ ఉండగా ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్‌ పీఠాన్ని దక్కించుకోవడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాఫిక్ గా మారింది. నిజామాబాద్ తమకే అంటూ ఛాలెంజ్ చేసిన బీజేపీ ఎంపీ అరవింద్(MP Aravind) కు కాంగ్రెస్ నేతలు షాక్ ఇచ్చారు. ఇక ముందే ఊహించినట్లు కరీంనగర్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకోగా, కొత్తగూడెంను మాత్రం సీపీఐ(CPI) సొంతం చేసుకున్నది. ఇక్కడ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambashiva Rao) మార్క్ స్పష్టంగా కనిపించింది. తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి మరీ, కొత్తగూడెం మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు.

Advertisement

Also Read: Chia Seeds: మలబద్ధకం ఇబ్బంది పెడుతోందా ? చియా సీడ్స్‌తో చెక్ పెట్టండిలా

11 చోట్ల కాంప్లికేటెడ్ ఇష్యూస్..

రాష్ట్ర వ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో కాంప్లికేటెడ్ ఇష్యూస్ కనిపించాయి. దీంతో ఆ స్థానాల్లోని ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో కోరం లేకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాల్ పాలకవర్గంలో 21 మంది సభ్యులు హాజరు కాకపోవడంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. మరోవైపు జనగామలో పూర్తి కోరం ఉన్నప్పటికీ వాయిదా పడటం గమనార్హం.కాంగ్రెస్ అండ్ మిత్రపక్షానికి ఎక్స్ అఫియోతో కలిపి 14 ఓట్లు రాగా, బీఆర్ ఎస్ కు కూడా అదే సంఖ్యలో ఓట్లు వచ్చాయి. దీంతో స్వంతంత్ర్య అభ్యర్ధులు కీలకంగా మారారు. మరోవైపు తొర్రురులో ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఎన్నిక వాయిదాకు కారణమైంది. కేతనపల్లిలో కూడా కాంగ్రెస్, బీఆర్ ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం ఏర్పడింది.

Advertisement

Also Read: Drugs Gang Arrest: కొండాపూర్‌లో ఈగల్ టీం మెరుపు దాడి.. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×