E-Paper
Advertisement

V Hanumantha Rao: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం: వీహెచ్

V Hanumantha Rao: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం: వీహెచ్
Advertisement

V Hanumantha Rao: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని కాంగ్రెస్ నాయకులు వీ హనుమంతరావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డితో కలిసి 8, 2, 13, తదితర వార్డుల్లో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ, పిల్లలతో ఖోఖో అటలో పాల్గొన్నారు. అలాగే ప్రజలతో కలిసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక ఛైర్మన్ స్థానాలను సాధిస్తుంది అన్నారు.

అబ్ కీ బార్ కిసాన్‌సర్కార్..

ఆరు గ్యారంటీలలో మహిళలకు ఇచ్చే తులం బంగారు, 2వేల 500పింఛన్ తప్పితే అన్ని హామీలు అమలు చేశామన్నారు. ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎలా అవుతారన్నారు. అబ్ కీ బార్ కిసాన్‌సర్కార్ అని మహారాష్ట్రలో డబ్బులు పెట్టారు. రైతులకు సంకెళ్లు వేశారని అందుకే సోనియా, రాహుల్ ఆలోచనలను అమలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నన్నారు. రాహుల్ గాంధీ స్పూర్తితో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. బీసీ నాయకుడిని ఎన్నుకోవడం శుభపరిణామం అన్నారు‌. బీసీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రిజర్వేషన్ల కోసం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే గవర్నర్ పెండింగ్‌లో పెట్టారన్నారు.

Advertisement

Also Read: Hyderabad Crime: హైదరాబాద్‌లో టెక్కీ ఆత్మహత్య.. తెర వెనుక కొత్త కోణం

తెలంగాణలో స్పోర్ట్స్ సిటీ..

బీజేపీ పనిలేని పార్టీ అని, జాతిపిత గాంధీని చంపిన పార్టీ అన్నారు. దేశాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తోంది అన్నారు. దేశంలో ముస్లిం, క్రిస్టియన్లను బయటకు వెళ్లగొట్టే కుట్రలు జరుగుతున్నాయి అన్నారు. అది ఎప్పటికీ జరగదన్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణను కేసీఆర్ విస్మరించారన్నారు. కేసీఆర్ రుణమాఫీ వల్ల లాభం కలగలేదన్నారు. తెలంగాణలో స్పోర్ట్స్ సిటీ, ఫూచర్ సిటీలను నిర్మిస్తున్నామన్నారు. ఒక్క ఇంట్లో నలుగురు మహిళలకు పించను ఇచ్చే పరిస్థితి లేదన్నారు. బంగారం ధర భారీగా పెరిగిందని, మహిళల, ప్రజలు గుర్తించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 24 వార్డుల్లో గెలుస్తుంది అన్నారు.

Advertisement

Also Read: Priyanka Chopra: ఆ మూడు నెలలు నరకం చూసా.. కూతురి విషయంలో ప్రియాంక ఎమోషనల్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×