E-Paper
Advertisement

Ambati Rayudu-Trump: ఇండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌..రంగంలోకి ట్రంప్‌, అంబ‌టి ట్రోలింగ్ మాములుగా లేదుగా

Ambati Rayudu-Trump: ఇండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌..రంగంలోకి ట్రంప్‌, అంబ‌టి ట్రోలింగ్ మాములుగా లేదుగా
Advertisement

Ambati Rayudu-Trump: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కొనసాగనుంది. ఇలాంటి నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు డ్రామాలు ఆడుతోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. బంగ్లాదేశ్ జట్టుకు అన్యాయం జరిగిందన్న ఒక్క కారణం చూపించి… రెచ్చిపోతుంది. టోర్నమెంట్ ఆడతాం కానీ… ఇండియా తో జరిగే మ్యాచ్ మాత్రం బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ( Shehbaz Sharif) కూడా తాజాగా అధికారిక ప్రకటన చేశారు. అయితే ఈ నేపథ్యంలో తెరపైకి ట్రంప్ ఎపిసోడ్ వచ్చింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ బహిష్కరించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ట్రంప్ ఈ సమస్యను ప‌రిష్క‌రించాల‌ని టీమిడియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సెటైర్లు పెంచారు. ఇండియా, పాక్ వార్ ఆపిన‌ట్లుగానే ఇప్పుడు ఈ యుద్ధం ఆపాల‌ని కోరారు.

Also Read: MS Dhoni on Ro-Ko: ఎవ‌డెన్ని డ్రామాలు చేసినా, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో Ro-Ko ఆడ‌తారు..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన‌ ధోని!

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు.. రంగంలోకి ట్రంప్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన షెడ్యూల్ ముందే ఫిక్స్.. ఇప్పుడు బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డ్రామాలు ఆడుతోంది. ఇలా అర్ధాంతరంగా మ్యాచ్ రద్దు అయితే కోట్లల్లో డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ఆ డబ్బంతా ఆ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కట్టేలాగా ఐసీసీ చర్యలు కూడా తీసుకుంటుంది. అయితే, ఈ వివాదం పైన తాజాగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించారు. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేశాడు కదా…? ఇప్పుడు కూడా రంగంలోకి ట్రంప్ ( Donald Trump) దిగాలని సెటైర్లు పేల్చారు అంబటి రాయుడు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడేలా ఒప్పించాల‌ని కోరారు. అప్పుడే ట్రంప్ పెద్దన్న అవుతాడ‌న్నారు. శాంతి చ‌ర్చ‌లు జ‌రిగి, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ స‌జావుగా జ‌రిగేలా చూడాల‌న్నారు.

ఇండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌..రూ.300 కోట్ల న‌ష్టం

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య మ్యాచ్ జ‌రుగ‌క‌పోతే, కోట్ల‌ల్లో న‌ష్టం రానుంద‌ట‌. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు రూ.300 కోట్ల ఫైన్ ప‌డ‌నుంది.

Advertisement

Also Read:  Ishan Kishan vs Sanju Samson: సంజు వ‌ర్సెస్ ఇషాన్..టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఓపెన‌ర్ గా ఎవ‌రు బెస్ట్ ? ఇదిగో రికార్డులు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×