E-Paper
Advertisement

TS Congress : రేసుగుర్రాల్లా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి.. కేసీఆర్‌కు దేత్తడి!

TS Congress : రేసుగుర్రాల్లా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి.. కేసీఆర్‌కు దేత్తడి!
Advertisement
Congress news telangana

Congress news telangana(Political news today telangana): ఢిల్లీ తెలంగాణ భవన్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహం ముందు టి.కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వెల్లువెత్తిన వరదలకు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని.. వారిని వెంటనే ఆదుకోవాలి కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు డిమాండ్ చేశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని.. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిందని రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారికంగానే 24 మంది చనిపోయారని.. 5వేల కోట్ల నష్టం వాటిల్లిందని.. రైతులంటే సీఎం కేసీఆర్‌కు లెక్క లేదా? అని ప్రశ్నించారు.

అంతకముందు, తెలంగాణ భవన్‌ ముందు ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు పరస్పరం ఒకరికొకరు కండువాలు వేసి గౌరవించుకున్నారు. ఇద్దరు ఎంపీలు కలిసి ఢిల్లీలో ధర్నా చేయడం ఆసక్తికరంగా మారింది.

Advertisement

గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, రేవంత్‌రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండేది. అలాంటిదేమీ లేదని ఇద్దరు నాయకులు పలుమార్లు స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని కోమటిరెడ్డి అంగీకరించడం లేదని ధిక్కార స్వరం వినిపిస్తున్నారనే ప్రచారం జరిగేది. కోమటిరెడ్డి వైఖరి కూడా అలాగే కనిపించింది. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధోరణి కూడా మారినట్టుంది.

హైకమాండ్ చూపిన బాటలో కోమటిరెడ్డి ముందుకెళ్తున్నారు. రేవంత్‌రెడ్డితో సఖ్యతగా ఉంటున్నారు. పీసీసీ చీఫ్ సైతం కాంగ్రెస్ గెలుపు కోసం తాను ఎన్ని మెట్లైనా దిగుతానని చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఆ ఇద్దరు బడా నేతలు పని చేస్తున్నారు. ఇటీవల ఉచిత విద్యుత్‌పై రేవంత్ హైదరాబాద్ కేంద్రంగా రెచ్చిపోతే.. కోమటిరెడ్డి విద్యుత్ సబ్‌స్టేషన్‌కెల్లి లాగ్ బుక్‌లు బయటకు తీసి పీసీసీ చీఫ్ ఆరోపణలకు మరింత బలం చేకూర్చారు. ఇలా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డిల జోడి.. కాంగ్రెస్‌లో రేసు గుర్రాలుగా కనిపిస్తోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×