E-Paper
Advertisement

Parliament Session Live: మోదీ స్పీచ్‌ కోసం వెయిటింగ్.. అవిశ్వాసంపై 3 రోజుల చర్చ.. డేట్స్ ఫిక్స్..

Parliament Session Live: మోదీ స్పీచ్‌ కోసం వెయిటింగ్.. అవిశ్వాసంపై 3 రోజుల చర్చ.. డేట్స్ ఫిక్స్..
Advertisement
Narendra modi news telugu

Narendra modi news telugu(Parliament monsoon session live updates) : జాతుల ఘర్షణతో మణిపూర్ రగిలిపోతోంది. ప్రధాని మోదీ స్పందించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఎలాగైనా మోడీతో మాట్లాడించాలని.. పార్లమెంట్‌లో ఏకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్.. తాజాగా చర్చకు తేదీలు ఖరారు చేశారు.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 8న అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో చర్చ ప్రారంభమవుతుంది. 9వ తేడీన కూడా చర్చ కంటిన్యూ అవుతుంది. ఆగస్టు 10న ప్రధాని మోదీ మాట్లాడుతారు. మొత్తం మూడు రోజుల పాటు చర్చ ఉంటుంది. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

నో కాన్ఫిడెన్స్ మోషన్‌పై పీఎం మోదీ ఏం మాట్లాడుతారనే ఆసక్తి పెరిగింది. సూటిగా, ధీటుగా, ఘాటుగా మాట్లాడే మోదీ.. ఈసారి విపక్షాలకు ఏ రేంజ్‌లో కౌంటర్ ఇస్తారో. గతంలో ‘ఏక్ మోదీ’ అంటూ ఛాతిపై చరుచుకుంటూ సభలో ఆయన చేసిన స్పీచ్.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అయింది. ఇప్పటికీ అనేకమంది ఆ వీడియో క్లిప్‌ను స్టేటస్‌లుగా పెట్టుకుంటుంటారు. ఏ టాపిక్‌లోనైనా అనర్గళంగా మాట్లాడే సత్తా.. ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేసే వాక్చాతుర్యం ఉన్న మోదీ.. మణిపూర్ పరిణామాలపై ఏం చెబుతారోననే ఇంట్రెస్ట్ కనిపిస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×