E-Paper
Advertisement

Ponguleti Srinivasa Reddy: కేరళలో కాంగ్రెస్ కూటమి విజయం ఖాయం.. మంత్రి పొంగులేటి ధీమా

Ponguleti Srinivasa Reddy: కేరళలో కాంగ్రెస్ కూటమి విజయం ఖాయం.. మంత్రి పొంగులేటి ధీమా
Advertisement

Ponguleti Srinivasa Reddy: కేరళ రాష్ట్రంలో వచ్చే నెల 9వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పతనంతిట్ట జిల్లా లోని అడూర్ అసెంబ్లీ నియోజకవర్గం యూడీఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి శాంతకుమార్ (కాంగ్రెస్ పార్టీ) మద్దతుగా వివిధ ప్రాంతాలలో మంత్రి ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమి పట్ల ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదన్నారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి సాధించిన విజయాలు దీనికి నిదర్శనమని మంత్రి పొంగులేటి చెప్పారు. గత దశాబ్దంగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందిగానీ, ప్రజలకు అందిన ఫలితాలు తక్కువగానే ఉన్నాయని విమర్శించారు. పదేళ్ల పాలన తర్వాత కూడా నిరుద్యోగం పెరుగుతుంటే, ప్రజలపై ఆర్థిక భారాలు అధికమవుతుంటే ,అది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా? అని మంత్రి ప్రశ్నించారు.

Advertisement

Also Read: Washing Machine Tips: బట్టలు ఉతికిన తర్వాత.. వాషింగ్ మిషన్ డోర్.. తెరిచి ఉంచాలా? మూసివేయాలా?

బీజేపీపై కూడా మంత్రి పొంగులేటి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా మతపరమైన రాజకీయాలతో ప్రజలను విభజించే ప్రయత్నం జరుగుతోందన్నారు. కేరళలో ఆ పార్టీకి స్పష్టమైన అభివృద్ధి దిశ లేదని పేర్కొన్నారు. కేరళ ప్రజల సెక్యులర్ భావజాలాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. సీపీఎం వైఫల్యాలు, బీజేపీ విభజన రాజకీయాల మధ్య కేరళ ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Also Read: Petrol Storage Rules: ఇంట్లో ఎంత పెట్రోల్ నిల్వ చేయవచ్చు? లిమిట్ దాటితే పడే శిక్షలు ఏంటి?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×