E-Paper
Advertisement

సల్మాన్‌కే సవాల్.. నయనతార ‘బిజినెస్’ మామూలుగా లేదుగా!

సల్మాన్‌కే సవాల్.. నయనతార ‘బిజినెస్’ మామూలుగా లేదుగా!
Advertisement

Nayanthara :నయనతార …లేడీ సూపర్ స్టార్ గా టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ ఇండియా వైడ్ గా క్రేజ్ కొట్టేసిన ఈ అమ్మడు ఇపుడు సరికొత్త స్ట్రాటజీతో  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కే గట్టి పోటీ ఇస్తోందట. అయితే అది నటనలో అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టేనండోయ్. అవును …ఈ అమ్మడు  సై అంటే సై  అంటుంది రెమ్యూనరేషన్ విషయంలో. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో రాబోతున్న ఓ భారీ ప్రాజెక్టు విషయంలో ఈ కోలీవుడ్ చిన్నది వేసిన స్కెచ్ చూసి ఫిలిం సర్కిల్స్ షాక్ అవుతున్నాయట .

ముందు  సినిమా బిజినెస్ లో ఇచ్చే వాటా తేల్చండి

 మ్యాటర్ లోకి వెళ్తే..జనరల్ గా మార్కెట్ ఉన్న హీరోలెవరైనా హీరోలు సినిమా హిట్ అయితే వచ్చే లాభాల్లో వాటా (Profit Sharing) అడుగుతుంటారన్న సంగతి తెల్సిందే. ఇక వందల కోట్ల మార్కెట్ ఉన్న సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరోల సంగతి చెప్పక్కర్లేదు.కానీ నాకేం తక్కువ అంటూ ఇప్పుడు నయన్ కూడా అదే దార్లో నడిచేందుకు రెడీ అయిపోయిందట. అవును ..”నాకు ఇచ్చే పది, పన్నెండు కోట్లు పక్కన పెట్టి  ముందు  సినిమా బిజినెస్ లో ఇచ్చే వాటా తేల్చండి అంటూ దిల్ రాజు ముందు సాలిడ్ కండీషన్ పెట్టిందట.దీంతో ఇప్పటి వరకు హీరోలనే ఇలా చూశాం కానీ ఒక హీరోయిన్ ఇలా వచ్చే లాభాల్లో వాటా అడగటం ఇండియన్ సినిమా హిస్టరీలోనే  మొదటిసారి చూస్తున్నాం అంటూ ముక్కున వేలేసుకున్నారట మేకర్స్ .

Advertisement

also read:దురంధర్ 2 మాయలో పడి చేతులు కాల్చుకుంటావా జక్కన్నా ?

జవాన్’ తర్వాత నయన్ రేంజ్  డబల్

 నిజానికి ‘జవాన్’ తర్వాత నయన్ రేంజ్  డబల్ అయిన సంగతి తెల్సిందే.అయితే అది మర్చిపోయి కొందరు నిర్మాతలు సినిమా కోసం అని వెళ్తే ఆమె అడిగే రేటు చూసి “అమ్మ బాబోయ్.. ఆ డబ్బుతో మేం చిన్న సినిమానే తీస్తాం” అంటూ బయపడి వచ్చారట. కానీ వంశీ పైడిపల్లికి మాత్రం నాకు  నయనే కావాలని పట్టుబట్టడంతో తప్పక భారీ అమౌంట్ ఇచ్చి రిస్క్ తీసుకోవడం కంటే, సినిమా హిట్ అయ్యాక లాభాల్లో వాటా ఇస్తే పోలే అని ఫిక్స్ అయ్యారట. అంటే సినిమా బ్లాక్ బస్టర్ అయితే నయన్ అకౌంట్‌లో పడేది మామూలు అమౌంట్ కాదన్న మాట. మొత్తానికి నయన్ స్ట్రాటజీ మాములుగా లేదుగా .

2027 ఈద్ కానుకగా రిలీజ్  ప్లాన్

Advertisement

 ఇక ఎన్నో రోజులుగా వెయింటింగ్ లిస్టు లో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడు అంటే  2027 ఈద్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఇందులో నయనతార కేవలం గ్లామర్ డాల్ గా కాకుండా కథను టర్న్ చేసే కీ రోల్ లో కన్పిస్తుందని తెలుస్తుంది. అందుకే దిల్ రాజు కూడా ఎక్కడా తగ్గకుండా ఈ ‘ప్రాఫిట్ డీల్’ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఇన్ సైడ్ టాక్.

 ఏది ఏమినా రెమ్యూనరేషన్ విషయంలో హీరోలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ లేడీ సూపర్ స్టార్ ఈ సినిమాతో “రెమ్యూనరేషన్ అనేది ఓల్డ్ ఫ్యాషన్.. ప్రాఫిట్ షేరింగ్ అనేది లేటెస్ట్ ఫ్యాషన్” అంటూ బాలీవుడ్ హీరోయిన్లందరికీ కొత్త గోల్స్ సెట్ చేస్తోందన్న మాట . చూడాలి మరి వంశీ క్లాస్ – సల్లూ మాస్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాతో నయన్ బాక్సాఫీస్ వద్ద ఎంత వాటా కొల్లగొడుతుందో!

also read:Dhurandhar Controversy: 1100 కోట్లు కొట్టారు సరే.. మా వాటా ఎక్కడ? అంటుంది ఎవరో తెలుసా ?వీడియో వైరల్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×