E-Paper
Advertisement

Municipal Results 2026: సంబురాలకు సిద్ధమైన కాంగ్రెస్.. మున్సిపాలిటీల్లో గెలుపు ధీమా!

Municipal Results 2026: సంబురాలకు సిద్ధమైన కాంగ్రెస్.. మున్సిపాలిటీల్లో గెలుపు ధీమా!
Advertisement

Municipal Results 2026:  రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ  ప్రారంభం.  పోలింగ్ ముగిసినప్పటి నుండి గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, వెలువడబోయే ఫలితాలను పండుగలా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. గ్రౌండ్ లెవల్లో భారీ ఎత్తున సంబురాలు నిర్వహించాలని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు కావడంతో, ఈ ఫలితాలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మెజారిటీ మున్సిపాలిటీలు తమ ఖాతాలోనే పడతాయని ఎగ్జిట్ పోల్స్, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.దీనిలో భాగంగానే జిల్లా కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల వద్ద విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేందుకు డీసీసీ అధ్యక్షులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ ప్రజల మధ్యే వేడుకలు జరపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Also Read:North Korea: ఉత్తర కొరియాలో కొత్త పరిణామాలు.. కిమ్ స్థానంలోకి కూతురు, వరుస కార్యక్రమాలకు హాజరు 

గాంధీభవన్ లో సంబురాలు

Advertisement

ముస్తాబైన గాంధీ భవన్.. రాష్ట్ర రాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో ఇప్పటికే సందడి నెలకొంది. పార్టీ ముఖ్య నేతలు ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ద్వారా గాంధీభవన్ లో సంబురాలు నిర్వహించాలని పార్టీ అన్ని ఏర్పాట్లూ చేస్తోన్నది. ఇక యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ తదితర యువజన కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఫలితాలు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమాలు చేయాలని పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలకు ఆదేశాలిచ్చారు.

​అభివృద్ధి నినాదానికే పట్టం?

​ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధిపై కాంగ్రెస్ చేసిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఇచ్చిన హామీలే తమను గెలిపిస్తాయని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ పాలనపై ప్రజలకు నమ్మకం ఉన్నదని, అందుకే 70 శాతానికి పైగా సీట్లు సాధిస్తామని పార్టీ భావిస్తున్నది. ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత రెగ్యులర్ ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Advertisement

Also Read:CM Revanth Reddy: దిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం వరుస భేటీలు.. రాహుల్, ఖర్గేలకు నివేదికలు అందజేత 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×