E-Paper
Advertisement

CM Revanthreddy Tour: ప్రజాపాలనకు రెండేళ్లు.. జిల్లాల పర్యటనకు శ్రీకారం, మక్తల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanthreddy Tour: ప్రజాపాలనకు రెండేళ్లు.. జిల్లాల పర్యటనకు శ్రీకారం, మక్తల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanthreddy Tour: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా రోజుకో జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. డిసెంబర్ ఒకటి అనగా సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

తెలంగాణలో ప్రజా‌పాలనకు రెండేళ్లు

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులోభాగంగా సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు.  నారాయణపేట కొడంగల్‌‌‌‌ లిఫ్ట్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌కు మోక్షం లభించింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు దశాబ్దం కిందట అనుమతులు వచ్చినా పనులు పట్టాలెక్కలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి.

Advertisement

సోమవారం నుంచి జిల్లాల పర్యటనలకు సీఎం శ్రీకారం

ఇందుకోసం సర్వేలు చేయించడం, భూ సేకరణ, టెండర్ల ప్రక్రియ దాదాపుగా పూర్తి అయ్యింది. సోమవారం సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు లక్షా 30 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రూ.4,350 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టనుంది.

ALSO READ: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిత్.. మోదీ-రాహుల్‌లను ఆహ్వానించనున్న సీఎం

భారీ బహిరంగ సభకు హాజరై ప్రసంగిచనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎస్పీలు, డీఎస్పీలను ఇన్‌ఛార్జులుగా నియమించినట్టు ఆ జిల్లా ఎస్పీ వినీత్ వెల్లడించారు. హెలిపాడ్ మొదలు కాన్వాయ్ నుంచి సభా వేదికకు వచ్చేవరకు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వివరించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×