E-Paper
Advertisement

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్…మరో విధ్వంసానికి రెడీ అవుతున్న యశ్!

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్…మరో విధ్వంసానికి రెడీ అవుతున్న యశ్!
Advertisement

Toxic Teaser: కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతూ కేజిఎఫ్ సినిమా ద్వారా రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు నటుడు యశ్(Yash). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజిఎఫ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా తర్వాత తదుపరి టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చే ఏడాది విడుదల కావడానికి సిద్ధమవుతోంది.

ఉగాది సందర్భంగా టాక్సిక్ విడుదల..

గీతు మోహన దాస్(Geethu Mohana Das) దర్శకత్వంలో యష్, నయనతార, కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. గోవాలో అందమైన బీచ్ వెనుక జరుగుతున్న డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా 2026 మార్చి 19వ తేదీ ఉగాది పండుగను పురస్కరించుకొని పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా ఇంగ్లీష్ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

క్రిస్మస్ లేదా జనవరి 1 న టీజర్..

Advertisement

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా దాదాపు పూర్తి అయినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర బృందం బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే సినిమా నుంచి టీజర్ విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ సినిమా టీజర్ క్రిస్మస్ లేదా జనవరి మధ్యలో విడుదల కాబోతోందని ఇండస్ట్రీ సమాచారం. త్వరలోనే టీజర్ విడుదలకు సంబంధించి అధికారక ప్రకటన వెల్లడి కానుంది.

రావణాసురుడి పాత్రలో యష్..

Advertisement

ఇక ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని యధావిధిగా అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఉగాది పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు అడివి శేష్ డెకాయిట్ కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తదుపరి వారంలో రామ్ చరణ్ పెద్ది సినిమా కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాక్సిక్ సినిమాపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి.. యష్ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో యష్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఈయన ఎంతో బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ తర్వాత రాబోతున్న చిత్రం టాక్సిక్ కావడంతో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×