E-Paper
Advertisement

CM Revanth: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

CM Revanth: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
Advertisement

రాష్ట్రంలోని దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు. బాల భరోసా స్కీం, ప్రణామ్ డే కేర్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ మానసికంగా ఎవరూ కుంగిపోకూడదని అన్నారు. దివ్యాంగులకు అండగా నిలవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు సాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు.

Advertisement

రూ. 50 కోట్లతో సహాయ పరికరాల పంపిణీ

దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం రూ. 50 కోట్ల వ్యయంతో ఉచిత సహాయ పరికరాల పంపిణీ చేపట్టిందని సీఎం వెల్లడించారు. దివ్యాంగులను వివాహం చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని.. తద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని దివ్యాంగులందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన సాధించిన విజయాలు ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని కొనియాడారు.

Advertisement

రాజకీయాల్లో ట్రాన్స్‌జెండర్లకు ప్రాధాన్యత

సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్ల కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సీఎం ప్రకటించారు. ట్రాన్స్‌జెండర్లను స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల వారు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికే ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నామని, త్వరలో జరగబోయే కేబినెట్ భేటీలో దీనిపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా శాస్త్రీయంగా కులగణన ప్రక్రియను పూర్తి చేశామని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో కొంతమందిలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని.. అయితే కాలక్రమేణా ఆ సమస్యలన్నీ సర్దుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లో అర్హులైన ప్రతి విద్యార్థిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని.. అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ALSO READ: Congress : మున్సి’పోల్స్’.. రెబల్స్, మిత్రపక్షంపై ఏం చేద్దాం?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×