E-Paper
Advertisement

Cheekatilo Trailer: క్రైమ్ థ్రిల్లర్ గా శోభిత ‘చీకటిలో’.. ట్రైలర్ రిలీజ్..

Cheekatilo Trailer: క్రైమ్ థ్రిల్లర్ గా శోభిత ‘చీకటిలో’.. ట్రైలర్ రిలీజ్..
Advertisement

Cheekatilo Trailer: ప్రముఖ నటి శోభిత ధూళిపాళ్ల (sobhita Dhulipala)నాగచైతన్య (Nagachaitanya)ను పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత మొదటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈమె క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చీకటిలో(Cheekatilo) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జనవరి 23వ తేదీ థియేటర్లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి ప్రమోషనల్ అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

సంధ్య పాత్రలో శోభిత..

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమాలో శోభిత సంధ్య అనే పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే జర్నలిస్టుగా పనిచేసిన ఈమె తన జాబ్ నచ్చక పోవడంతో పాడ్ కాస్ట్ నిర్వహిస్తుంది. ఇలా యాంకర్ గా కొనసాగుతున్న సంధ్య తన పాడ్ కాస్ట్ కు చీకటిలో అనే పేరు పెడుతుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈమె రాత్రి పూట జరిగే హత్యలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇక ఈ ట్రైలర్ లో భాగంగా తన ఇద్దరి ప్రాణ స్నేహితులు కూడా అర్ధాంతరంగా మరణించడంతో వారి చావు వెనుక గల కారణాలు ఏంటి? అసలు ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అనే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఆసక్తి రేకెత్తిస్తున్న చీకటిలో ట్రైలర్..

Advertisement

ఇలా పెళ్లి తర్వాత సరికొత్త సినిమాతో అక్కినేని కోడలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ ట్రైలర్ మాత్రం మంచి అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమా జనవరి 23వ తేదీ అమెజాన్ లో అందుబాటులోకి రాబోతోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలాక్షి, ఈషా చావ్లా, సీనియర్ నటి ఆమని వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు.

?igsh=OGhscm1pODJiN28%3D

Advertisement

మరి సరికొత్త కథ నేపథ్యంలో చీకటిలో అంటూ విభిన్న టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అక్కినేని కోడలు ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకోబోతున్నారనేది తెలియాల్సి ఉంది.. ఇక నాగచైతన్యను శోభిత 2024 డిసెంబర్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన అనంతరం శోభితను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత శోభితో సినిమాలకు దూరమవుతుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని చీకటిలో అనే సినిమా ద్వారా స్పష్టమవుతుంది. ఇక శోభిత న్స్ సినిమాలలో కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో శోభిత చైతు కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: Chiranjeevi Fan dies: చిరంజీవి సినిమా చూస్తూ అభిమాని మృతి.. ఏం జరిగిందంటే?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×