E-Paper
Advertisement

నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా.. పాలమూరు వేదికగా సీఎం రేవంత్ సవాల్!

నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా.. పాలమూరు వేదికగా సీఎం రేవంత్ సవాల్!
Advertisement

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, ఫలితంగా ప్రాజెక్టుల నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు రోజుల పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల పరిశీలన అనంతరం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి సమీపంలోని ఉద్దండాపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

గతంలో ప్రాజెక్టులు ఎవరూ పంట్టింకోలేదు..

Advertisement

గతంలో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులను ఎవరూ పట్టించుకోలేదని సీఎం అన్నారు. తమ ప్రభుత్వంలో పిల్లలు ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్ లతోపాటు ప్రజా ప్రతినిధులుగా ఉండి ప్రజాసేవ చేసేందుకు త్రిబుల్ ఐటీ తో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ లతో పాటు ఉమ్మడి పాలమూరులో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామని చెప్పారు. ఒకప్పుడు కొడంగల్ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం మహబూబ్ నగర్, తాండూర్ వెళ్లేవారని ప్రస్తుత ఇక్కడే అన్ని రకాల ఉన్నత ప్రమాణాలతో కాలేజీల నిర్మాణాలు కావడంతో హైదరాబాదు నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదివే వాతావరణం కల్పించామన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివి.. సీఎం స్థాయికి

Advertisement

తల్లిదండ్రుల తలరాతలు మాతలన్నా తమ పిల్లల్ని తప్పక చదివించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన తాను సీఎం స్థాయికి ఎదిగానన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించి జిల్లాను సష్యశ్యామలం చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.పాలమూరులో బిఆర్ఎస్ జండా ఎగరనివ్వమని అన్నారు. కరీంనగర్ నుంచి వలస వచ్చిన కేసీఆర్ ను పాలమూరు ప్రజలు ఆదరించారన్నారు. పాలమూరు ప్రజలకు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు.పదేళ్లు ఎనిమిది లక్షల కోట్లతో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా కేసీఆర్ పూర్తి చేయలేదన్నారు.

పొర్లు దండాలు చేసిన పాపాలు పోవు

వలసల గోస తీరుస్తాడని ప్రజలు ఆశిస్తే కేసీఆర్ వచ్చి మోసం చేశారన్నారు. ఐదేళ్లు ఎంపీగా ఉండి ఐదు సార్లు కూడా పాలమూరుకు వచ్చిన సందర్భం లేదన్నారు. ఏపీలో పార్టీ నష్టపోయినా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, గొర్రె కసాయోడిని నమ్మినట్లు జనం కేసీఆర్ ను రెండుసార్లు సీఎంగా చేస్తే తన కుటుంబాన్ని బాగుపరుచుకున్నారు తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పాదయాత్ర కాదు త్వరలో దండాలు చేసిన మీరు చేసిన పాపాలు తీరవని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు సీఎం సవాల్

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిన చోటే బీఆర్ఎస్ ఓట్లు అడగాలి ఇందిరమ్మ ఇల్లు కట్టిన చోట మాత్రమే మేము ఓట్లు అడుగుతాం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని రేవంత్ రెడ్డి అన్నారు. తన 30 నెలల పాలన పై చర్చకు సిద్ధమన్నారు. పాలనపై చర్చల్లో ఓడితే దేనికైనా సిద్ధం అన్నారు అని సీఎం అన్నారు. పాలనపై మీతో చెప్పించుకునే స్థితిలో మేము లేమని సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు.

రేంవత్ రెడ్డి హామీ

డిసెంబర్ నాటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల నీటిని అందిస్తామని హామీని ఇచ్చారు. 15 లక్షల కొత్త రేషన్ కార్డులు, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రేషన్ కార్డులో జారీ, పేదలకు సన్న బియ్యం పంపిణీ,ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమన్నారు.

Also Read: తెలంగాణలో ఫుట్‌బాల్ విప్లవం.. ఫీఫా కోచ్‌ల పర్యవేక్షణలో ఉచిత శిక్షణకు అదిరిపోయే ఛాన్స్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×