// // CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదు -->
E-Paper
Advertisement

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు!

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు!
Advertisement

CM Revanth Reddy:  మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.  ఆయన మంత్రులు, ముఖ్య నేతలతో జూబ్లీహిల్స్ లో ప్రత్యేకంగా మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ సమిష్టి గా అందరం పని చేయాల్సిందేనని నొక్కి చెప్పారు. కచ్చితంగా అన్ని స్థానాలు గెలవాల్సిందేనని సూచించారు. పాత ,కొత్త నేతల సమన్వయంతో పనిచేయాలన్నారు.

గెలుపు బాధ్యత ఆయా పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి లదేనని వివరించారు. ఇక ఎన్నికలు పూర్తయ్యే వరకు మంత్రులు, ఇతర ముఖ్యనాయకులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సమస్యలను ఎప్పటికప్పుడు పీసీసీ చీఫ్​, వార్ రూమ్ దృష్టికి తీసుకురావాలన్నారు. మంత్రులందరూ జిల్లాలకు తప్పనిసరిగా వెళ్లాల్సిందేనని చెప్పారు. ఇక సర్వే లలో వెనకబడిన మున్సిపాలిటీ లను విశ్లేషించిన సీఎం ఆయ ప్రాంతాల్లో ఫోకస్ పెట్టాన్నారు. ఎప్పటికప్పుడు ఇంచార్జ్ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. తనకు రోజు వారిగా రిపోర్ట్ అందజేయాలని ఇన్ చార్జ్ మంత్రులకు ఆదేశాలిచ్చారు. అసంతృప్తి నేతలను బుజ్జగించాలని సీఎం సూచించారు.

Advertisement

Also Read: CM Revanth Reddy: నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్.. ఆ విషయాలపై క్లారిటీ!

నేడు మిర్యాలగూడకు సీఎం

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో  సీఎం రేవంత్ రెడ్డి  (CM Revanth Reddy) పర్యటించనున్నారు. 200 కోట్లతో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం సీఎం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

కాంగ్రెస్ కు పోటీ లేదు 

Advertisement

మీటింగ్ అనంతరం పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ లతో కలిసి మంత్రులతో మీటింగ్ నిర్వహించామన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలపై చర్చించామన్నారు. కచ్చితంగా 90 శాతం స్థానాలు గెలుస్తున్నామన్నారు. కాంగ్రెస్ కు పోటీ లేదని, మెజార్టీ స్థానాలు తమవేనని పీసీసీ చీఫ్​ చెప్పారు. రెబల్స్ ను విత్ డ్రా చేయిస్తున్నామన్నారు. జగిత్యాల విషయంలో పరిశీలిస్తున్నామని, సమస్య ను పరిష్కరిస్తామన్నారు. ఇక డిప్యూటీ సీఎం, మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ లు జిల్లాల్లో ఉండి రాలేకపోయారన్నారు. వారితో ఫోన్ లో మాట్లాడామన్నారు. గద్వాల ఇష్యూను కూడా పరిష్కరింపజేస్తామన్నారు.

నేడు పీసీసీ అబ్జర్వర్ల నియామకం..

ప్రతి మునిసిపాలిటీ కి, కార్పొరేషన్ కు పీసీసీ పరిశీలకులను నియమించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు లేని నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్ లకు బాధ్యతలు కల్పిస్తూ పార్టీ ఉత్తర్వులురిలీజ్ చేయనున్నది.

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు మరో అరుదైన ఆహ్వానం.. ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలంటూ లేఖ

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×