// // Feel Good Movie ott : అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసే సినిమా... -->
E-Paper
Advertisement

Feel Good Movie OTT : అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసే సినిమా… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన ఫీల్ గుడ్ మూవీ

Feel Good Movie OTT : అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసే సినిమా… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన ఫీల్ గుడ్ మూవీ
Advertisement

Feel Good Movie OTT : డిజిటల్ విప్లవం రాకముందు ఉన్న పాత జ్ఞాపకాలను, వేసవి సెలవుల సరదాలను ఓ సినిమా చాలా చక్కగా చూపిస్తోంది. ఇది 1999 వేసవి కాలంలో మహారాష్ట్రలోని ఒక గ్రామంలో స్నేహం, ప్రేమ చుట్టూ తిరిగే కథ ఇది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ కూడా. బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ కూడా పొందింది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఈ సినిమాను ఎక్కడ చూడచ్చు అంటే

‘ఏప్రిల్ మే 99’ (April May 99) 2025లో విడుదలైన మరాఠీ కమింగ్-ఆఫ్-ఏజ్ సినిమా. రోహన్ మపుస్కర్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. సాజిరి జోషి, ఆర్యన్ మెంఘ్జీ, శ్రేయాస్ థోరట్ మరియు మంథన్ కనేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ కూడా ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా 2025 మే 23న థియేటర్లలో రిలీజ్ అవ్వడంతో పాటు, 8.7/10 రేటింగ్ కూడా పొందింది ఈ మూవీ. ప్రస్తుతం ప్రైమ్ వీడియో లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అది 1999 సమ్మర్ టైమ్.. మహారాష్ట్రలోని కొంకణ్ ఏరియాలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. ఆ వేసవి సెలవుల్లో బాగా ఎంజాయ్ చేయాలని వాళ్లు ప్లాన్ వేసుకుంటారు. కానీ సరిగ్గా అప్పుడే ఒకరి తండ్రి.. తన కొడుకుని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ముంబై పంపాలని డిసైడ్ అవుతాడు. ఆ టైమ్‌లోనే పూణే నుంచి జాయీ అనే ఒక అందమైన అమ్మాయి అదే ఊరికి వస్తుంది. ఆమెకి ఇంగ్లీష్ బాగా వచ్చని తెలిసి, ముంబై వెళ్లకుండా ఉండటం కోసం హీరో ఆమె దగ్గరే ఇంగ్లీష్ నేర్చుకుంటానని వాళ్ల నాన్నని ఒప్పిస్తాడు.

ఆ తర్వాత ఆ ముగ్గురు అబ్బాయిలు, జాయీ కలిసి చేసే అల్లరి, వాళ్ల మధ్య మొదలయ్యే స్నేహం, చిన్నపాటి ప్రేమ చుట్టూ కథ నడుస్తుంది. ఇంటర్నెట్, ఫోన్లు లేని ఆ రోజుల్లో.. సైకిళ్ల మీద తిరుగుతూ, చిన్న చిన్న విషయాలకే సంతోషపడుతూ గడిపిన ఆ రోజులు వాళ్ల జీవితాల్ని ఎలా మార్చాయి అనేది చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.

Advertisement

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న అపర్ణ బాలమురళి మలయాళం రొమాంటిక్ మూవీ.. థియేటర్లలో విడుదలైన నెలలోపే..

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×