E-Paper
Advertisement

CM Revanth: సదర్మట్ బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్.. యాసంగి పంటకు నీటి విడుదల

CM Revanth: సదర్మట్ బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్.. యాసంగి పంటకు నీటి విడుదల
Advertisement

సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మామడ మండలం పోన్కల గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన సదర్మట్ బ్యారేజీని సీఎం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది.

ఘనస్వాగతం పలికిన మంత్రులు, ప్రజాప్రతినిధులు

Advertisement

అంతకుముందు.. హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్న సీఎంకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు మ్యాపులు, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా బ్యారేజీ నిర్మాణ క్రమం, నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

బహిరంగ సభకు తరలిన ముఖ్యమంత్రి

Advertisement

బ్యారేజీ ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో నిర్మల్ జిల్లా కేంద్రానికి బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉండటంతో ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగం, పెద్ద ఎత్తున రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

ALSO READ: Supreme Court: ప్రభాకర్ రావు విచారణను ఇంకెంత కాలం కొనసాగిస్తారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×