E-Paper
Advertisement

Clove Water: లవంగాల నీరు 10 రోజులు తాగితే.. మందులు వాడక్కర్లేదు తెలుసా ?

Clove Water: లవంగాల నీరు 10 రోజులు తాగితే.. మందులు వాడక్కర్లేదు తెలుసా ?
Advertisement

Clove Water: లవంగాలు కేవలం వంటింటి సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. వీటిలో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున రెండు లవంగాలను నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి.
10 రోజుల పాటు లవంగాల నీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయినే విషయాలను గురించిన పూర్తి వివరానలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: లవంగాల నీరు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీని వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. వరుసగా 10 రోజులు తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ శుభ్రపడి, ఆహారం త్వరగా జీర్ణం అవ్వడం ప్రారంభిస్తుంది.

Advertisement

2. రోగనిరోధక శక్తి పెరుగుదల: లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. 10 రోజుల పాటు దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు నుంచి రక్షణ లభిస్తుంది.

3. నోటి ఆరోగ్యం: లవంగాల్లో ‘యూజినోల్’ అనే పదార్థం ఉంటుంది. ఇది సహజమైన యాంటీ సెప్టిక్. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, చిగుళ్ల వాపు, పంటి నొప్పిని తగ్గిస్తుంది. నోటిలోని బ్యాక్టీరియాను నశింపజేసి నోటిని తాజాగా ఉంచుతుంది.

Advertisement

4. బరువు తగ్గడానికి సహాయం: లవంగాల నీరు శరీర మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇది శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించడానికి సహాయ పడుతుంది. వ్యాయామంతో పాటు ఈ నీటిని 10 రోజుల పాటు తీసుకుంటే బరువులో మార్పును గమనించవచ్చు.

5. కాలేయ ఆరోగ్యం: శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో లవంగాల నీరు కీలకంగా పనిచేస్తుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరిచి , దాని పనితీరును మెరుగు పరుస్తుంది.

6. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ: డయాబెటిస్ ఉన్నవారికి లవంగాల నీరు మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయ పడుతుంది.

లవంగాల నీటిని ఎలా తయారు చేయాలి ?
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో 2 నుంచి 3 లవంగాలను నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి.. కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. మీకు నచ్చితే ఇందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.

జాగ్రత్తలు:
అతిగా వద్దు: రోజుకు 2-3 లవంగాల కంటే ఎక్కువ వాడకూడదు. అతిగా తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది.

గర్భిణీలు: గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా లేకుండా దీనిని తీసుకోకూడదు.

అలర్జీ: కొంతమందికి లవంగాల వల్ల చర్మంపై దద్దుర్లు లేదా కడుపులో మంట రావచ్చు. అటువంటప్పుడు వెంటనే ఆపేయాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×