E-Paper
Advertisement

అమెరికా, చైనా సరసన భారత్.. ‘స్కైరూట్’ ఘనతపై సీఎం రేవంత్ హర్షం!

అమెరికా, చైనా సరసన భారత్.. ‘స్కైరూట్’ ఘనతపై సీఎం రేవంత్ హర్షం!
Advertisement

CM Revanth Reddy: అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావ‌ర‌ణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్ కుమార్ చందన, సీఓఓ నాగ భరత్ డాకా ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. భారతదేశంలోనే ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా ప్రయోగించిన తీరును వారు ముఖ్యమంత్రికి వివరించారు.

Also Read:మాకు రాజకీయాల కంటే.. తెలంగాణ ప్రగతే ముఖ్యం.. దిల్లీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Advertisement

ఈ విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేటు రంగం ద్వారా ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచిందని సీఎంకు వారు తెలిపారు. సమావేశంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పురోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ప్రభుత్వం–ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. వారు సాధించిన విజ‌యం భారతదేశాన్ని ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుంద‌ని ప్రశంసించారు.

Also Read: తగ్గాడా? వ్యూహం మార్చాడా? పొలిటికల్ రీ-ఎంట్రీకి వంశీ బిగ్ ప్లాన్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×