E-Paper
Advertisement

Telangana Sports: టీజీ-20 క్రికెట్ లీగ్ గెలిచిన జట్టుతో.. సీఎం రేవంత్ భేటీ..!

Telangana Sports: టీజీ-20 క్రికెట్ లీగ్ గెలిచిన జట్టుతో.. సీఎం రేవంత్ భేటీ..!
Advertisement

Telangana Sports: తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి క్యాష్ రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల విజయవంతంగా జరిగిన సీజన్-1 టీజీ-20 క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను అభినందించిన ముఖ్యమంత్రి వారికి చెక్కులను అందజేశారు.

టీజీ20 ఒక మంచి అవకాశం..

క్రీడలకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గతంలో జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు టీజీ20 ఒక మంచి అవకాశంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. టీజీ20లో విజయం సాధించిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులందరినీ అభినందిస్తూ, భవిష్యత్తులో దేశ ప్రతిష్ఠను పెంచే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

Advertisement

Also read: Supreme Court: ఆ ఒక్క కారణంతో స్కూళ్లను అడ్డుకోవద్దు.. తమిళనాడుకు సుప్రీం వార్నింగ్!

ఈ కార్యక్రమంలో..

ఏ రంగంలోనైనా రాణించాలంటే ఫోకస్ అవసరమని, ఎంచుకున్న రంగంపై గౌరవం, ఆసక్తి ఉండాలని క్రీడాకారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొన్నారు.

Advertisement

Also read: Jangaon News: బచ్చన్న పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం.. పట్టించుకోని యంత్రాంగం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×