E-Paper
Advertisement

టైమ్ పాస్ కోసం అమ్మాయిలతో ఆడుకునే ప్లేబాయ్… కట్ చేస్తే గుండె జారిపోయే ట్విస్ట్

టైమ్ పాస్ కోసం అమ్మాయిలతో ఆడుకునే ప్లేబాయ్… కట్ చేస్తే గుండె జారిపోయే ట్విస్ట్
Advertisement

Mind Bending Psychological Thriller: ఒక అందమైన రిచ్ అబ్బాయి… కావలసినంత డబ్బు, పబ్బులు, పార్టీలు, అమ్మాయిలు… ఆ లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ సడన్ గా ఆ అందం అంతా పోయి జీవితం తలకిందులు అయితే ఎలా ఉంటుంది ? అది తెలియాలంటే ‘వెనిలా స్కై’ (Vanilla Sky) అనే ఈ హాలీవుడ్ మూవీని చూడాల్సిందే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

సినిమా ఒక ప్లాస్టిక్ ముసుగు ధరించిన డేవిడ్ ఆమ్స్ తో అనే వ్యక్తితో షురూ అవుతుంది. అతను జైలు గదిలో సైకియాట్రిస్ట్ డాక్టర్ మెక్‌కేబ్ కు తన జీవితం గురించి చెప్తాడు. కథ నాన్-లీనియర్‌గా, గతం-వర్తమానం మధ్య నడుస్తుంది. మన హీరో డేవిడ్ ఆమ్స్. అతనున్యూయార్క్‌లో ఒక పెద్ద పబ్లిషింగ్ కంపెనీ వారసుడు. అందగాడు, ధనవంతుడు, స్వేచ్ఛగా జీవించే ప్లేబాయ్. అతను జూలియానా గియానితో క్యాజువల్ రిలేషన్ లో ఉంటాడు. కానీ జూలియానా అతన్ని గాఢంగా ప్రేమిస్తుంది, కానీ డేవిడ్ మాత్రం ఆమెను సీరియస్‌గా తీసుకోడు.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఒక పార్టీలో అతనికి సోఫియా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె సహజత్వం, నిజాయితీ డేవిడ్‌ ను అట్రాక్ట్ చేస్తాయి. ఇంకేముందు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ఆ అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు. కానీ అతను అలా ఆ అమ్మాయిని ఇష్టపడడం చూసి జూలియానా తీవ్ర అసూయతో రగులుతుంది. అందుకే ఒకరోజు డేవిడ్‌ను బలవంతంగా తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్తుంది. కోపంతో అతివేగంగా కారు నడిపి వంతెనపై గుద్దేస్తుంది.

ఆ ప్రమాదంలో జూలియానా మరణిస్తుంది. డేవిడ్ బ్రతికినా అతని ముఖం మాత్రం చూడలేనంత వికృతంగా మారిపోతుంది. అందమైన జీవితం ఒక్కసారిగా నరకప్రాయంగా మారుతుంది. డేవిడ్ డిప్రెషన్‌ లోకి వెళ్ళిపోతాడు. అందరికీ దూరంగా ప్లాస్టిక్ ముసుగు వేసుకుని తిరుగుతాడు. కానీ కొంతకాలం తర్వాత అతని జీవితం మళ్లీ మారుతుంది. డాక్టర్లు అతని ముఖాన్ని సర్జరీ ద్వారా మునుపటి అందానికి తీసుకు వస్తారు. సోఫియా కూడా అతని జీవితంలోకి తిరిగి వస్తుంది. అంతా ఓకే అనుకుంటున్న టైమ్ లో… డేవిడ్‌కు భయంకరమైన హాల్యూసినేషన్స్ మొదలవుతాయి.

Advertisement

కొన్నిసార్లు సోఫియా ముఖం స్థానంలో జూలియానా ముఖం కనిపిస్తుంది. ఆ గందరగోళంలో డేవిడ్ తన బెడ్‌పై ఉన్న జూలియానాను సోఫియా అనుకుని చంపేస్తాడు. ఈ హత్యతో అతను జైలుకు వెళ్లాల్సి వస్తుంది. డాక్టర్ మెక్‌కేబ్‌తో మాట్లాడుతున్నప్పుడు డేవిడ్‌కు నెమ్మదిగా నిజం తెలుస్తుంది. కారు ప్రమాదం తర్వాత అసలేం జరిగింది ? హీరోకి ఉన్న వ్యాధి ఏంటి ? చివరకు ఆ జబ్బు తగ్గడానికి ఏం చేశారు ? క్లైమాక్స్ లో కేక పెట్టించే ఆ ట్విస్ట్ ఏంటి ? అన్నది కథ.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

2001లో విడుదలైన ఈ మూవీ సైకలాజికల్ మైండ్ బెండింగ్ థ్రిల్లర్. హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్, పెనెలోపి క్రజ్, కామెరాన్ డియాజ్ నటించిన ఈ మూవీ స్పానిష్ క్లాసిక్ Abre los Ojosకి అధికారిక రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమా Amazon Prime Videoతో పాటు YouTube Moviesలో రెంట్ కి అందుబాటులో ఉంది. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ లేదు. ఇంగ్లీష్ ఆడియోతోనే చూడాలి.

Read Also: హర్రర్ నుంచి కామెడీ వరకు… ఈవారం ఓటీటీలోకి రానున్న మలయాళం సినిమాలు

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×