// // Kaleshwaram project CBI inquiry: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు రంగం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు -->
E-Paper
Advertisement

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు రంగం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు రంగం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Advertisement

Kaleshwaram project CBI inquiry: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరుతూ ఒత్తిడి పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. న్యాయ నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి అధికారికంగా లేఖ రాయాలని ముఖ్యమంత్రి అధికారులను నిర్దేశించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైతే సీబీఐ డైరెక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని మంత్రుల బృందం నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని సూచించారు.

కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదని న్యాయ నిపుణులు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. అందువల్ల సీబీఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైన అడ్డంకులు ఏవీ లేవని వారు అభిప్రాయపడ్డారు. హైకోర్టు గతంలో పి.సి. ఘోష్ కమిషన్ ఏర్పాటును కానీ ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను కానీ తప్పు పట్టలేదని అవి ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయని నిపుణులు వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణను వేగవంతం చేయాలని భావిస్తోంది. ప్రాజెక్టు వైఫల్యాలు నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన ఈ సమీక్షలో సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాత్మక ప్రణాళికపై ఆయన దిశానిర్దేశం చేశారు.  ఇరిగేషన్ ఈఎన్సీ శ్రీధర్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలను న్యాయ నిపుణులకు వివరించారు.

న్యాయపరమైన చిక్కులు లేవని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం సీబీఐ విచారణ విషయంలో వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటపెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విచారణను వేగవంతం చేయడం ద్వారా బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబు రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి సీఎస్ రామకృష్ణారావు ముఖ్యమంత్రి కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు..

Advertisement

Read Also: బీఆర్ఎస్ అసంపూర్తి ఇండ్ల పై మంత్రి పొంగులేటి సమీక్ష.. త్వరలో వాటికి..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×