E-Paper
Advertisement

CM Revanth Delhi Tour: ఢిల్లీలో సీఎం.. గ్లోబల్ సమ్మీట్ సక్సెస్‌పై సోనియా, రాహుల్ ప్రశంసలు

CM Revanth Delhi Tour: ఢిల్లీలో సీఎం.. గ్లోబల్ సమ్మీట్ సక్సెస్‌పై సోనియా, రాహుల్ ప్రశంసలు
Advertisement

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ విజ‌యవంత‌మైన తీరు, తెలంగాణ రైజింగ్ విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్క‌ర‌ణ‌పై వారి మ‌ధ్య చ‌ర్చ కొన‌సాగింది. స‌మ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబ‌డులు రాబ‌ట్టేందుకు ఒప్పందాలు చేసుకోవ‌డంపై అగ్ర నేత‌లు సీఎంను ప్ర‌శంసించారు.

Advertisement

ఈ భేటీలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. అలాగే, ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను కూడా కాంగ్రెస్ అగ్రనేతలకు వివరించారు.

ఖర్గేతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్‌కు చేరారు. పార్లమెంట్‌లో వారు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై, రాష్ట్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.

Advertisement

సమగ్రంగా, తెలంగాణ ప్రభుత్వ పనితీరు, రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహక కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వతో సన్నిహిత సంబంధాలను పటిష్టం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ఘ‌నంగా నిర్వ‌హించ‌బడిన నేపథ్యంలో రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల పైగా పెట్టుబ‌డులు క‌ట్టేందుకు వివిధ సంస్థ‌లు ముందుకొచ్చాయి. ఈ విజయం పై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పార్ల‌మెంట్‌లో పోరిక బ‌ల‌రాం నాయ‌క్, సురేష్ షెట్కార్, డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, ఎం. అనిల్ కుమార్‌ అభినంద‌న‌లు తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×