E-Paper
Advertisement

2-Minute Rule for Exercise: ‘58 నిమిషాల పని-2 నిమిషాల వ్యాయామం’.. ఈ సింపుల్ ఫార్ములాను ఫాలో అవుతున్నారా?

2-Minute Rule for Exercise: ‘58 నిమిషాల పని-2 నిమిషాల వ్యాయామం’.. ఈ సింపుల్ ఫార్ములాను ఫాలో అవుతున్నారా?
Advertisement

2-Minute Rule for Exercise: రోజంతా పనిలో బిజీగా ఉండే వాళ్లకు కూడా ఆరోగ్యం, ఫోకస్ రెండూ సమంగా ఉండాలి. పని మధ్య చిన్న బ్రేక్ తీసుకుని కాస్త వ్యాయామం చేస్తే శరీరం, మెదడు రిఫ్రెష్ అవుతుంది. అందుకే.. ఇటీవలి కాలంలో ‘58 నిమిషాల పని – 2 నిమిషాల వ్యాయామం’ అనే సింపుల్ ఫార్ములా చాలా పాపులర్ అవుతోంది. ఈ చిన్న అలవాటు మీ వర్క్‌లో ఫోకస్ పెంచడమే కాకుండా, మీ శరీరాన్ని కూడా యాక్టివ్‌గా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. పని ప్రదేశంలో చేయాల్సిన వర్కౌట్స్ ఏమిటి? ఎలా చేయాలి.. వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎందుకీ ఫార్ములా?

గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం వలన నడుము, మెడ, తుంటి కండరాలు బలహీనపడి వెన్ను నొప్పి, మెడ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా  కుర్చీకే అతుక్కుపోవడం వల్ల శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమస్యలకు చెక్‌ పెట్టేలా 58 నిమిషాల పని – 2 నిమిషాల వ్యాయామం ఫార్ములాను పాటించాలి.

Advertisement

Read Also: నాలుగు పదుల వయసులోనూ ఫిట్‌నెస్.. ఆ కిటుకు మన చేతుల్లోనే ఉందన్న నిపుణులు!

తాయ్‌ చి హాప్‌ స్ట్రెచ్‌: 

ఈ వ్యాయామంలో చిన్న కదలికల ద్వారా శరీరాన్ని సున్నితంగా సాగదీయాలి. ముఖ్యంగా తుంటి, మోకాళ్లు, చీలమండల కదలికలపై దృష్టి పెట్టాలి.  ఇది కండరాల బలం, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. అలాగే ఈ ఎక్సర్‌సైజ్ ఒత్తిడిని తగ్గించి, మెదడును రిఫ్రెష్ చేస్తుంది. దీని కోసం పైకి లేచి నిటారుగా నిలబడి, కాలి వేళ్లతో పైకి కిందికి కదలాలి. ఇలా చేస్తున్నప్పుడు ఒక చేతిని పైకెత్తి, మరొక చేతిని కిందకు దించాలి. ఇలా 50 సార్లు రిపీట్‌ చేయాల్సి ఉంటుంది.

సెమీ-పుష్‌-అప్స్‌:

Advertisement

పని ప్రదేశంలో ఎప్పటికప్పుడు బలాన్ని పెంచుకోవాలంటే.. ఈ తేలికైన సెమీ పుష్-అప్స్ చేయాల్సిందే. దీని కోసం ఏదైనా బేస్‌ను ఉపయోగించుకుని 10 నుంచి 15 పుష్‌-అప్స్‌ చేస్తే సరిపోతుంది. ఈ సెమీ-పుష్‌-అప్స్‌ వలన శరీరం మొత్తానికీ బలం పెరుగుతుంది. ముఖ్యంగా ఛాతి, చేతులు, భుజాలు, కోర్ కండరాలు బలపడతాయి.

సిట్టింగ్‌ లెగ్‌ రెసిస్టెన్స్‌:

మీరు కూర్చున్న కుర్చీ అంచున కూర్చుని, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. తర్వాత మీ మోకాళ్లను నెమ్మదిగా ఛాతీ వైపుకు పైకి లేపాలి.. ఆ తర్వాత నెమ్మదిగా కిందకు దించాలి. ఇలానే పదేసి సార్లు చొప్పున 3 సార్లు రిపీట్‌ చేస్తే సరిపోతుంది. తర్వాత మీ వీపును గోడకు ఆనించి కుర్చీ మాదిరి ముడుచుకుని ఒక నిమిషం పాటు అలానే కూర్చోవాలి.

లెగ్‌ స్వింగ్స్‌:

ఈ వ్యాయామం మీ కండరాల కదలికను మెరుగుపరచడానికి చేసే ఒక డైనమిక్ స్ట్రెచింగ్ వ్యాయామం. దీనిలో ఒక కాలును ముందుకు వెనుకకు లేదా పక్కలకు ఊపుతూ ఉండాలి. ఇది తొడలు, పొత్తికడుపు కింది భాగం, తొడల మధ్య ఉన్న కండరాల సమూహాన్ని సాగదీస్తుంది. అలాగే ఈ స్ట్రెచింగ్ వల్ల చీలమండల పనితీరు చురుగ్గా ఉంటుంది.

Read Also: జిమ్‌కు వెళ్లకుండానే ఈ మూడు పనులు చేయండి.. బాడీ ఫిట్‌నెస్ ఎందుకు రాదో చూద్దాం!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×