E-Paper
Advertisement

Hyderabad: కారు డోర్ తగిలి చిన్నారి మృతి.. డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి..

Hyderabad: కారు డోర్ తగిలి చిన్నారి మృతి.. డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి..
Advertisement
car accident

Hyderabad: చిన్న నిర్లక్ష్యం. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రెండేళ్ల చిన్నారిని చంపేసింది. అప్పటి వరకూ ఆనందంగా ఉందా కుటుంబం. భార్య, భర్త, కూతురు. ముగ్గురూ కలిసి బండి మీద వెళ్తున్నారు. అంతలోనే దారుణం జరిగిపోయింది. ఆ చిన్నారి నడిరోడ్డుపైనే విగతజీవిగా పడిపోయింది. హైదరాబాద్ ఎల్బీనగర్లో జరిగిందీ ఘటన.

ఒకడు కారును కేర్‌లెస్‌గా రోడ్డు మీదే ఆపేశాడు. వెనుక నుంచి సయ్యద్, శశిరేఖ.. వాళ్ల కూతురైన రెండేళ్ల ధనలక్ష్మి బైక్ మీద వస్తున్నారు. అంతలోనే కారును ఆపిన వ్యక్తి.. సడెన్‌గా డోర్ ఓపెన్ చేశాడు. వెనకాలే స్పీడ్‌గా వస్తున్న బైక్ మీదున్న చిన్నారి తలకు ఆ కార్ డోర్ తగిలింది. అంతే, బైక్ మీద నుంచి కుప్పకూలి రోడ్డు మీదే పడిపోయింది. ఘటనలో చిన్నారి తీవ్రగాయాలతో చనిపోయింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కూడా ముందుకు రాలేదు ఆ కారు డ్రైవర్.

Advertisement

ప్రమాదం జరిగిన వెంటనే కారును నడిపిన దుర్గా ప్రసాద్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకుని.. దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేసి.. కారు సీజ్ చేశారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×